కేఏ పాల్ ఆట నుంచి ఫౌల్ ?? నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు

16:22 - March 25, 2019

*నామినేషన్ పత్రాలు, అఫిడవిట్‌లో చాలా భాగం ఖాళీ

*కేవలం పేరు, అడ్రస్, పాన్ కార్డ్ నంబర్ మాత్రమే ఇచ్చారు 

*కేఏపాల్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు 

కేఏ పాల్ నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రజా శాంతి పార్టీ తరుఫున నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి కిలారి ఆనంద్‌(కేఏ పాల్‌) పోటీ చెస్తున్నట్టుగా, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ఆయన శుక్రవారం నామపత్రాన్ని కూడా దాఖలు చేశారు. కానీ నామినేషన్‌కు సంబంధించి ఆయన ప్రాథమిక వివరాలతో కూడిన దరఖాస్తును మాత్రమే అందజేసినట్లు అధికారులు తెలిపారు. 


ఆ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్‌లో ఆయన చాలా భాగం ఖాళీగా వదిలేశారు. నామినేషన్ పేపర్లపై అధికారులు చెప్పే వరకు ఫోటో కూడా అంటించలేదు ఈ నామినేషన్ లో కేఏ పాల్ వివరాలేవీ ప్రకటించలేదు. కేవలం పేరు, అడ్రస్, పాన్ కార్డ్ నంబర్ మాత్రమే ఇచ్చేశాడట. పేరును కిలారి ఆనంద్ గా చెప్పిన పాల్. ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీని మాత్రమే ఇచ్చారు. నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులు, అప్పులు అఫిడవిట్ పత్రాలను పాల్ సమర్పించలేదు.


 తన చేతిలో 30వేల రూపాయలు నగదు మాత్రమే ఉన్నట్టు చెప్పాడు. ఆస్తుల్ని ప్రకటించలేదు. ఇన్ కం టాక్స్ కట్టలేదట ఆ కేసుల వివరాల్ని వెల్లడించలేదు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే ఈ వివరాలు కావాలని పాల్ కు ఫోన్ చేసి కోరారట.. కానీ ఆయన అఫిడవిట్ సమర్పించలేదు. నామినేషన్లకు సోమవారమే ఆఖరి గడువు. ఆ తర్వాత పరిశీలన. తిరస్కరణ ఈ నేపథ్యంలో కేఏపాల్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.