చివరికి జయలలిత ఆస్తులు ఎవరికి దక్కాయో తెలుసా...?

13:18 - April 26, 2019

ఒకటి కాదు.. రెండు కాదు.. 900 కోట్ల ఆస్తులు.. మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల విలువ భారీగా ఉంది. అయితే ఆమె చనిపోయాక అంత ఆస్తిని ఎవరికి చెందాలనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు దానికి సమాధానం దొరికిందట. వివరాల్లోకి వెలితే...జయలలిత ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లుగా సాగి బాగానే సంపాదించారు. 900 కోట్లకు పైగా ఆమె ఆస్తులు కూడబెట్టారు. అంత సడన్ గా చనిపోతానని ఊహించలేదో ఏమో కానీ జయలలిత బతికి ఉన్నప్పుడు తన ఆస్తులు తన తదనంతరం ఎవరికి దక్కాలో వీలు నామా రాయలేదు. ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో కూడా తన ఆస్తులను ఎవరికీ రాయలేదు.. జయలలిత తన వారుసులుగా ఎవరినీ నమ్మకపోవడం గమనార్హం. అందుకే ఇప్పుడా ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఐటీశాఖ పేర్కొంది. ఇదిలావుంటే...జయలలిత మరణం తర్వాత ఆమె వారసురాలుగా చాలా మంది ముందుకొచ్చారు. జయలలిత మేనకోడలు జయ మేనల్లుడు శశికళ ఫ్యామిలీ జయలలిత కూతురు కోడుకు.. ఇలా అనేకమంది కోర్టుకెక్కారు. కానీ ఆస్తుల కోసమే వారంతా వచ్చారని.. జయలలిత బతికున్నప్పుడు ఆమె తో లేరని వారికి సంబంధం లేదని కోర్టు ఎవ్వరికీ ఆస్తులను కేటాయించలేదు. దీంతో జయ వారుసులుగా కోర్టుకెక్కిన వారెవ్వరికీ ఆమె ఆస్తులు దక్కలేదు. జయలలిత తన వారసులుగా ఎవరినీ ప్రొజెక్ట్‌ చేయలేదు. ప్రజాసేకే అంకితమయ్యారు. దీంతో ఆమె ఆస్తులు కూడా ఇప్పుడు ఆమె ఆస్తులు కూడా ప్రభుత్వానికే స్వాధీనమయ్యాయి. ఐటీ శాఖ జప్తు చేయడంతో జయ వందల కోట్ల ఆస్తులపై వారసుల పోరాటం ముగిసిపోయింది.