పవన్ అప్పులే 33కోట్లా?, సోషల్ మీడియాలో జనసేనాని ఆస్తుల, అప్పుల వివరాలు..

12:26 - March 22, 2019

*పవన్ ఆస్తులు 52 కోట్లు, అప్పులు 33 కోట్లు 

*భార్య, పిల్లల ఆస్తుల విలువకూడా నాలుగుకోట్లకు దగ్గరలోనే 

*ఆస్తులు, అప్పులు వెల్లడించిన జనసేనాని 

 

పవన్ కల్యాణ్ మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటులందరికంటే వేరుగా కనిపించే, ప్రవర్తించే గుణమే ఆయనని అభిమానులకి మరింత దగ్గరగా చేసింది. పవన్ దగ్గరికి సహాయం కోసం వెళ్ళిన ఎవరూ ఉట్టిచేతులతో రాలేదని చెప్పుకుంటారు. గతంలో ఆయన తన కార్ ని అమ్మేసినప్పుడు కూడా ఒక చారిటీకి సహాయం చేయటంకోసమే ఆ కారు అమ్మేసారని కూడా ఒక రూమర్ చక్కర్లు కొట్టింది. అయితే పవన్ కి తన మనీ మానేజ్మెంట్ మీద అస్సలు శ్రద్దలేదనేది మాత్రం అంతా ఒప్పుకునే మాటే.

ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టాక తాన దగ్గర డబ్బు లేదని ఆయన సభల్లోనే చెప్పేసాడు. జనసేన పార్టీ ఫండ్ ఉన్నా అది సొంత ఆస్తులలెక్కలోకి రానట్టే. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం పవన్ 33కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ఉన్నాడు.అవును టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగిన పవన్ దగ్గర డబ్బులేకపోగా కోట్ల రూపాయల అప్పులుచేసాడు ఇంతకీ ఈ సమాచారం ఎలా బయటికివచ్చిందీ అమంటే. జనసేన అధినేత హోదాలో.. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురువారం నామినేషన్ దాఖలు చేశాడు.
 
ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల గురించినవివరాలని కూడా అఫిడవిట్ నామినేషన్ తోపాటు సమర్పించాల్సిఉంటుంది. ఇందులోని విషయాలు అధికారికంగా విడుదల కాలేదు కానీ. అనధికారికంగా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. పూర్తిగా నిజం అవునా కాదా చెప్పలేం కాని గత కొన్నాల్లుగా పవన్ ఫైనాన్షియల్ ఇబ్బందులవిషయంలో వచ్చిన వార్తలని చూస్తే ఈ వివరాలు దాదాపుగా నిజమే అనుకోవాలి. ఆఫిడవిట్ లో పవన్ పేర్కొన్న ప్రకారం తన పేరుమీద ఉన్న చరాస్తులు .12 కోట్లు కాగా. స్థిరాస్తుల విలువ ర 40 కోట్లుగా చెబుతున్నారు. అంటే మొత్తం కలిపిమొత్తం రూ.52 కోట్లు అనుకున్నా అప్పులే 33 కోట్లదాకా ఉందటం గమనార్హం. ఇక.. పవన్ సతీమణి అన్నా లెజినోవా పేరుమీద ఉన్న ఆస్తి కేవలం 30 లక్షలు ఇక ఆమె పేరుమీద ఉన్న స్థిరాస్తులు రూ.40లక్షలు ఉన్నట్లుగా వెల్లడించారు అంటే మొత్తం కలిపి ఒక కోటి కూడా దాటదు. ఇక పిల్లల పేరు మీద మాత్రం రూ.2.92 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

అప్పులు ఇచ్చిన వాళ్ళలో పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా ఉన్నారు.  పలువురు నిర్మాతలకు సైతం ఆయన డబ్బు బాకీ పడ్డట్లు అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలు చెప్పకనే చెప్పేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు ఇన్ని అప్పులు పెట్టుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి పవన్ రావటం షాకింగ్ గా మారింది. స్నేహితులు.. బంధువులు.. నిర్మాతలకు తిరిగి చెల్లించాల్సిన అప్పులు భారీగా ఉండటం గమనార్హం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ అప్పుల లెక్కను చూస్తే. త్రివిక్రమ్ శ్రీనివాస్- 2.40 కోట్లు,  హారిక హాసిని-1.25కోట్లు, కె సురేఖ 1.07కోట్లు, ఎం. ప్రవీణ్ కుమార్ 3కోట్లు, ంవృశ్ప్రసాద్-2కోట్లు, శ్రీబాలాజీ సిని చిత్ర మీడియా-2కోట్లు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్-27కోట్లు, వై నవీన్ కుమార్-5.50 కోట్లు. అంటే మొత్తం కలిపి పవన్ కళ్యాణ్ తిరిగి చెల్లించాల్సిన  రుణాలు : రూ.33కోట్లు. వీటిల్లో వడ్డీలలాంటి లెక్కలు ఉండవుకాబట్టి అవీ కలుపుకుంటే ఇంకా ఎక్కువే అవ్వొచ్చు మరి....