తనకు కులం, మతం లేదన్నందుకు పవన్ కళ్యాన్ నామినేషన్ తిరస్కరిస్తారా?

14:17 - March 23, 2019

ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల కోలాహలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు జనసేనాని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం గాజువాక రెండు స్థానాల నుంచి పోటీచేస్తూ నామినేషన్లు దాఖలు చేశారు.

ప్రస్తుత నామినేషన్ లో అభ్యర్థి వ్యక్తిగత అంశాల కాలంలో ఏ కులమో ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ కులమో నింపకుండా ‘నాట్ అప్లికేబుల్’ అని రాశారు. తాను ఏ కులానికి చెందిన వాడిని కాదని చెప్పేందుకు పవన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో ఆసక్తికరంగానూ ఆదర్శంగానూ మారింది. 

ఇక పవన్ కళ్యాణ్ బాటలోనే జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా నడిచారు.  ఆయన సైతం తన నామినేసన్ లో కుల ప్రస్తావన వద్ద ‘నాట్ అప్లికేబుల్’ అని రాయడం విశేషం. ఇలా పవన్ తో సాన్నిహిత్యంగా ఉండే చాలా మంది జనసేన అభ్యర్థులు ఇదేరకంగా తమ నామినేషన్ల దాఖలు సమయంలో వ్యవహరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తాము చెబుతుంది ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతోనే  నామినేషన్ల నుంచే తమ విధానం ఇదీ అని స్పష్టం చేస్తున్నామని పవన్ కళ్యాన్ తన చేతల ద్వారా నిరూపించడం విశేషం.  


అయితే, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా కానీ.. ఎంపీగానీ నామినేషన్ వేసే అభ్యర్థులు దరఖాస్తు ఫారంలో అన్ని కాలమ్ లు నింపాల్సి ఉంటుంది.  ఏ ఒక్క కాలం ఏ కారణం చేత అయినా నింపకపోయినా. వివరాలు తెలుపకపోయినా ఆ నామినేషన్ అనర్హతకు గురవుతుంది. పోటీచేసే అవకాశాన్నే దూరం చేస్తుంది. ఒకవేళ వివరాలు సరిగ్గా లేని పక్షంలో పవన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్న ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ అదే జరిగితే తనకు బదులుగా బరిలో నిలిచేది ఎవరన్న విషయాన్ని కూడా పవన్ పేర్కొనలేదు.