చిన్నవేనా.. అన్నీనా!

00:15 - August 18, 2018

             టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, కొన్నాళ్ళకు విలన్ గా,ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోకి  హీరోయిన్ లకు  ఫాదర్ గా ఇలా అనేక రకాల పాత్రలతో ఇమేజ్ ను పెంచుకుంటున్న లెజండరీ నటుడు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారబోతున్నారడు..
             ఫ్యామిలీ హీరో జగపతి బాబుకు  అప్పట్లో విపరీతమైన ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉండేవారు. కుటుబం అంతా కలిసి చూడదగ్గ సినిమాలు జగపతి బాబు నుండి చాలా వచ్చాయి. జగపతి హీరోగా నటించిన ప్రతి సినిమా దాదాపు హిట్టే.. లేదంటే తప్పకుండా మ్యూజికల్ హిట్ అయిన అయ్యింది.  హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన  జగపతి బాబు అనేక వేరియేషన్స్ తో దుమ్ము దులిపేశాడు.
          జగపతిబాబు ఇప్పుడు నటుడిగానే కాకుండా నిర్మాతగా మారబోతున్నాడు.  జగపతి బాబు ఫాదర్ వి.బి. రాజేంద్రప్రసాద్‌ అప్పట్లో  ప్రముఖ నిర్మాత. ఆయన మార్గంలో నడుద్దాం అనుకున్నాడో ఏమో,  జగపతి త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌ కు నిర్మాణం చేపడుతున్నాడట. వెబ్ సిరిస్ నుండి చిన్నగా మూవీ నిర్మాణం వైపు కూడా అడుగులు వేసే ఆలోచనలు ఉన్నట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. వెబ్ సిరీస్ తో వదిలేస్తాడా.. మూవీలు కూడా తీస్తాడా అనేది వేచి చూడాలి మరి.