ఐటమ్‌ సాంగ్స్‌పై క్లారిటీ ఇచ్చిన తమన్నా...

14:14 - February 27, 2019

హీరోయిన్స్ గా స్టార్ హీరోల సరసన నటిస్తూ భారీ చిత్రాల్లో నటిస్తూ ఐటెం సాంగ్స్ చేయడం బాలీవుడ్ హీరోయిన్స్ నుండి మొదలైంది. బాలీవుడ్ లో పలువురు హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేసిన విషయం తెల్సిందే. ఆ పద్దతి సౌత్ లో కూడా స్టార్ట్ అయ్యింది. హీరోయిన్స్ లో తమన్నా ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేసింది. హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో డబ్బు కోసం తమన్నా ఐటెం సాంగ్స్ చేస్తుందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ఈ విమర్శలకు తమన్నా తాజాగా క్లారిటీ సమాధానం ఇచ్చింది.  నేను హీరోయిన్ గా నటించే సమయంలో ఎంతగా సంతృప్తి చెందుతానో ఐటెం సాంగ్స్ చేసే సమయంలో కూడా చాలా సంతృప్తి చెందుతాను. నటించడంలో ఉన్న సంతృప్తి ఐటెం సాంగ్ చేసినప్పుడు కూడా నాకు కలుగుతుందని అందుకే ఐటెం సాంగ్స్ చేయాలంటే ఆసక్తి చూపిస్తానంటూ తమన్నా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మి చిత్రంతో పాటు మరో రెండు మూడు చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇటీవలే ఈమె 'ఎఫ్ 2' చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్న నేపథ్యంలో మరోసారి తమన్నా బిజీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది.