ఐపీఎల్‌: నేడు హైదరాబాద్‌ వర్సెస్‌ పంజాబ్‌

17:36 - April 8, 2019

ఐపీఎల్‌12లో భాగంగా నేడు మోహిలీ వేధికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ కింగ్స్‌ ఎలెవన్‌ను పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. విలియమ్సన్‌ గైర్హాజరీలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన భువనేశ్వర్‌ కుమార్‌ ఓవైపు...సుధీర్ఘకాలంగా ధోనీ సహవాసంతో అపార అనుభవం గడించిన అశ్విన్‌ మరోవైపు. ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది.ఇరుజట్లు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడేసి విజయాలతో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. ఓపెనర్ల జోరుకు తోడు బౌలింగ్‌ బలంతో ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...టాపార్డర్‌ నిలకడతో పాటు మ్యాజిక్‌ స్పెల్స్‌తో మ్యాచ్‌లు గెలుస్తూ వస్తున్న కింగ్స్‌ లెవెన్స్‌ పంజాబ్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరగనుంది. వరుస విజయాల తర్వాత లాస్ట్‌ మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రెండు టీమ్‌లు మళ్లీ గెలుపు బాట పట్టాలనే ఉత్సాహంతో సమరానికి సై అంటున్నాయి.