భారత్, పాక్ యుద్ధం?: ఎవరి బలం ఎంత? అణుయుద్దమే వస్తే ఎవరికీ నష్టం?

01:08 - February 21, 2019

*భారత్ పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నట్టేనా? 

*ఇరు దేశాల త్రివిధ దళాల్లోనూ ఎవరి ఆయుధ బలం ఎంత? 

*ఒకవేళ అణుయుద్దమే సంభవిస్తే ఎవరికీ ఎక్కువ నష్టం 

 

 

దాడి తర్వాత భారత్ పాక్ లమధ్య దాదాపుగా యుద్ధమేఘాలు కమ్ముకున్నంతగా వాతావరణం మారిపోయింది. ఇరు దేశాలమధ్యా యుద్దం రాకూడదనే అంతా కోరుకుంటూ వచ్చినా ఇప్పుదు నెలకొన్న తాజా పరినామాలా రీత్యా యుద్దం వరకూ వెళ్ళినా వెళ్ళొచ్చు అనే ఊహని కూడా కొట్టి పారేయలేం. ఇదే సందర్భంలో ఒక పక్క పాక్ తో పెట్టుకోవద్దు లాంటి హెచ్చరికలు చేస్తూనే మరోపక్క చర్చల దిశగా ఆలోచిద్దామ అంటూ భారత్ కూ సూచనలు పంపిస్తున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 

‘అణుఆయుధాలు కలిగి ఉన్న రెండు దేశాలమధ్యా యుద్దం అన్న ఆలోచన రాకూడదు, అణు ఆయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం ఆత్మహత్యతో సమానం. కనీసం కోల్డ్ వార్ దిశగా కూడా ఆ ఆలోచనలని వెళ్ళనివ్వకూడదు ఎండుకంటే ప్రచ్చన్న యుద్దం కూడా ప్రత్యక్ష్య యుద్దానికి దారి తీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రెండు దేశాలమధ్యా ఉన్న ఏకైక పరిష్కారం ద్వైపాక్షిక చర్చలే. కానీ శాంతి నెలకొల్పడానికి మేమ్ను చేసే ప్రయత్నాలకు భారత్ స్పందించడం లేదు’ అని ఒక ఆంగ్ల పర్తికకు ఇచ్చిన ఇంటర్వ్యూ;లో చెప్పాడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 

అయితే కాశ్మీర్ లోనూ, భారతదేశం లోపలా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలని పూర్తిగా నిలిపివేసి ఉగ్రవాద నిర్మూలన దిశగా తమ ప్రయత్నాలు కొనద్సాగిస్తే తప్ప ఆ దేశంతో చర్చలు సాధ్యమని భారత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అటు శాంతి మంత్రం జపిస్తూనే  ‘భారత్ ఒకడుగు ముందుకేస్తే, పాక్‌ రెండడుగులు ముందుకొస్తుంది. ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి అనేక మార్లు పాక్‌ చేస్తోన్న ప్రతిపాదనలను భారత్ తిరస్కరిస్తుంది’ అంటూ మళ్ళీ కయ్యాన్ని తెచ్చిపెట్టే మాటలు వల్లిస్తున్నారు పాకిస్థాన్ ప్రధాని. 

    ఈ నేపథ్యం లో అసలునిజంగా యుద్దమంటూ వస్తే ఈ రెండు దేశాలమీదా ఆ ప్రభావం ఎలా ఉండబోతుందన్నది పక్కన పెడితే అసలు ఏదేశపు ఆయుధ సంపత్తి ఎలా ఉన్నది అని ఆలోచిస్తే... 

ఎవరి బలం ఎంత? 

 ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద మిలటరీ కలిగిఉన్న దేశంగా ఉండగా, పాకిస్థాన్ ఆరవ స్థానంలో ఉంది. ఇండియాలో త్రివిద దళాల్లోని జవాన్ల సంఖ్య 21.40 లక్షలు కాగా, పాక్ సైన్యం 6.54 లక్షలు. రిజర్వ్ దళాలు ఇండియాలో 11.55 లక్షలు కాగా, పాక్ వద్ద 5.13 లక్షలు ఉన్నాయి. ప్రధాన యుద్ధ ట్యాంకులు ఇండియా వద్ద 4,500 ఉండగా, పాక్ వద్ద 3 వేల వరకూ ఉన్నాయి. ఆర్మ్ డ్ ఫైటింగ్ వెహికిల్స్ భారత అమ్ములపొదిలో 6,704 ఉండగా, పాక్ వద్ద 2,828 ఉన్నాయి. సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్ విషయంలో పాక్ మెరుగ్గా ఉంది. ఈ తరహా గన్స్ ఇండియా వద్ద 290 ఉండగా, పాక్ వద్ద ఏకంగా 465 ఉన్నాయి.

ఇక మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ ఇండియా వద్ద 292 ఉండగా, పాకిస్థాన్ వద్ద 134 ఉన్నాయి. సాధారణ యుద్ధ విమానాలు ఇండియా వద్ద 2,216 ఉండగా, పాక్ వద్ద 1,143 ఉన్నాయి. జెట్ యుద్ధ విమానాలు ఇండియా వద్ద 323, పాక్ వద్ద 186 ఉన్నాయి. మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లు భారత్ వద్ద 329, పాక్ వద్ద 225 ఉన్నాయి. హెలికాప్టర్లు ఇండియా వద్ద 775, పాక్ వద్ద 323 ఉన్నాయి. యుద్ధ విమానాలను మోసుకెళ్లగల వాహక నౌక ఇండియా వద్ద ఒకటి ఉండగా, పాక్ వద్ద అది కూడా లేదు. జలాంతర్గాములు ఇండియా వద్ద 15, పాక్ వద్ద 8 ఉన్నాయి. న్యూక్లియర్ వార్ హెడ్లు ఇండియా వద్ద 120 ఉండగా, పాక్ వద్ద 130 వరకూ ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త ఆయుధాల సమీకరణ

అయితే ఇప్పటికే  భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునే దిశగా పాకిస్తాన్‌ చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో భారత దేశ సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వెంట మోహరించే లక్ష్యంతో యుద్ధ ట్యాంకులు, ఆధునిక తుపాకీలను పలు విదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి టీ–90లు సహా దాదాపు 600 యుద్ధ ట్యాంకులను సమకూర్చుకుంటోంది. వీటిలో  3 కిమీల నుంచి 4 కిమీల దూరంలోని లక్ష్యాలను  కచ్చితంగా ఛేదించగల అత్యాధునిక కంప్యూటరైజ్డ్‌ ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఉంది. 

విదేశీ కొనుగోళ్లే కాకుండా, 2025 నాటికి దాదాపు 220 ట్యాంకులను చైనా సహకారంతో  దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలని పాక్‌ నిర్ణయించింది.  చైనా నుంచి వీటీ–4, ఉక్రెయిన్‌ నుంచి  అప్లాడ్‌–పీ ట్యాంకులనూ కొనుగోలు చేస్తోంది. 150ఎంఎం ఎస్పీ మైక్‌–10 ఆధునిక తుపాకులను సైతం సమకూర్చుకుంటోంది. ఇటలీ నుంచి 245 ఈ తరహా తుపాకులను పాక్‌ కొనుగోలు చేస్తోంది.  పాక్‌ క్షిపణి వ్యవస్థలను సైతం బలోపేతం చేసుకుంటోంది. విధానపరమైన జాప్యం కారణంగా ఆయుధ సంపత్తి పెంచుకునే విషయంలో భారత్‌ నత్త నడకన నడుస్తోందనే విమర్శలున్నాయి. అయితే, ఇప్పటికైతే, టీ–90, టీ–72, అర్జున యుద్ధ ట్యాంకులతో భారత్‌ పాక్‌ కన్నా బలంగానే ఉంది. 

అణ్వాయుధాలు

క్షిపణులు, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది.ఐదు వేల కిలోమీటర్లలో‌పు లక్ష్యాలను ఛేదించే అగ్ని-3తో కలిపి ఇటువంటి 9 రకాల క్షిపణి వ్యవస్థలు మన దేశానికి ఉన్నాయి. కాగా పాకిస్తాన్ చైనా సహాయంతో క్షిపణులను తయారు చేసుకుంటోంది. భారత్‌లోని లక్ష్యాలను ఛేదించగలిగే మొబైల్‌ షార్ట్‌, మీడియం రేంజ్‌ ఆయుధాలు పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. 2,750 కి.మీ లక్ష్యాన్ని ఛేదించగలిగే షహీన్‌ 3తో కలిపి మొత్తం 10 రకాల క్షిపణులు ఉన్నాయి. అలాగే స్టాక్ హోం ఇంటర్నెషనల్ పీస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ లెక్కల ప్రకారం పాకిస్తాన్ వద్ద 140-150 న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉండగా.. భారత్‌ వద్ద సుమారు 130-140 ఉన్నాయి. 

అణుయుద్ధం గనక సంభవిస్తే? 

ఇక హిమాలయాలు సహా, సరిహద్దు పర్వత ప్రాంతాల్లో మనతో యుద్ధం చేయాలంటే, పాకిస్థాన్ సరైన పోటీ చూపే అవకాశాలు లేవని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. భౌగోళికాంశాలన్నీ ఇండియాకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే గడిచిన రెండు దశాబ్దాల్లోనూ యుద్దం దాని ఖేత్రాన్ని కేవలం సరిహద్దులనే కాక జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చిందన్న విశయాన్ని మనం గ్రహించాలి. బోర్దర్ వద్దకే యుద్దం పరిమితమైతే ఏ దేశానిది గెలుపు అనే ఆలొచన కానీ... అదే అన్వస్త్ర యుద్దం గనక అయితే మొట్టమొదటి టార్గెట్ ఆయా దేశాల్లోని ప్రధాన నగరాలే అవుతాయి. రెండో ప్రపంచ యుద్దకాలం నాటి జపాన్ ని ఒక సారి గుర్తు చేసుకుంటే అప్పటి జనాభా ప్రకారమే అన్ని లక్షల మరణాలూ కొన్ని దశాబ్దాల పాటు రేడియేషన్ ప్రభావంతో మొత్తం స్మాశానంగా మారిన జపాన్ మాదిరిగా ఇప్పుడు మన దేశాలు అంతటి విద్వంసాన్ని భరించగలవా అన్న ప్రశ్న మొలకెత్తుతుంది. అంటే కేవలం ఒక కాశ్మీర్ కోసం మొత్తం దేశంలోని నగరాలనే నాశనం చేసుకునే దిడ్శగా పయణించే యుద్దం అవసరమా అని ఇరు దేశాలూ ఆలోచించుకోవాలి. ఇక ఇంకో విశయం అణుయుద్దమంటూ వస్తే పాకిస్థాన్ కి సహాయం అందించే విషయంలో చైనా కూడా ఉంటుందన్న సంగతి మరవకూదదు...