జవాన్ల కుటుంబాలకు నేను అండగా నిలబడతాను: సానియా మీర్జా

01:59 - February 18, 2019

*ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెడితేనే దేశభక్తి ఉందని భావించే వాళ్ల కోసమే ఈ పోస్ట్

*నేను నా దేశం కోసం ఆడుతాను, అందుకోసం నా చెమట చిందిస్తాను

*ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే

 

పాక్ దేశస్థుడిని పెళ్లాడిన తర్వాత కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోన్న ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడింది. తాజాగా పుల్వామా టెర్రర్ దాడి ఘటనే ఈ ట్రోలింగ్‌కు కారణం. సాధారణంగానే భారత్, పాక్‌ల మధ్య ఏ చిన్న విషయం జరిగినా ఆ ప్రభావం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పడుతుంది. క్రికెట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయినా, పాక్ చేతిలో భారత్ ఓడినా సోషల్ మీడియాలో టార్గెట్ అయిపోతుంది సానియా మీర్జా.. 

పుల్వామాలో ఉగ్రదాడి కారణంగా 42 మంది భారత జవాన్లు మరణించిన సంఘటనపై దేశమొత్తం ఉడికిపోతోంది. అయితే అంత విషాదంలో సానియా ఉగ్రదాడిని ఆలస్యంగా ఖండించినందుకు భారత నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా ఇదే సమయంలో సానియా తన కొత్త డ్రెస్‌ను చూపిస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. సంధ్రభం కాని సందర్భంలో చేసిన పనికి సానియాకు సోషల్ మీడియా ట్రోలింగ్ ఎఫెక్ట్ మొదలైంది. "ఇక్కడ ఇంత దారుణం జరిగితే నీ డ్రెస్ చూడాలామెము?,  త్వరగా ఈ దేశమ్నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిపోయి, కాపురం పెట్టు.. అంటూ తీవ్రస్తాయిలో మండి పడ్డారు. ఆ ట్రోలింగ్ కి సమాధానంగా సానియా మరో ఉద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది. దానిలో...

ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెడితేనే సెలబ్రిటీలకు దేశభక్తి ఉందని భావించే వాళ్ల కోసమే ఈ పోస్ట్ పెడుతున్నా. మేం సెలబ్రిటీలం కాబట్టి.. కొందరు వ్యక్తులు మాపై పనిగట్టుకొని విద్వేషాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం వారే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని గొంతు చించుకొని అరవాల్సిన అవసరం మాకు లేదు. ప్రతీ ఒక్కరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు.  నేను నా దేశం కోసం ఆడుతాను, అందుకోసం నా చమట చిందిస్తాను. అలా నేను నా దేశానికి సేవ చేస్తున్నాను. సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నేను అండగా నిలబడతాను. వాళ్లు ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు. ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే. ఇలాంటి రోజు మరొకటి చూడొద్దని కోరుకుంటున్నా.

ఈ రోజుని, జరిగిన ఘటనని అంత సులువుగా మర్చిపోలేము. కానీ ఇప్పటికీ ద్వేషం కంటే నేను శాంతిని కోరుకుంటున్నా. ఏదైన ఉపయోకరమైన విషయం జరగడం కోసం ఆగ్రహిస్తే.. అది మంచిది. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో స్థానం లేదు.. ఉండదు కూడా.  మీరు కూడా ఇంట్లో కూర్చొని సెలబ్రిటీలు ఎన్ని పోస్ట్‌లు చేశారు, ఏం పోస్ట్ చేశారో.. అని తీర్మానించడం మానేసి దేశానికి ఉపయోగేపడే పని చేయండి. దేశానికి మీ వొంతు సహాయం అందించండి.. మేం చేస్తున్నాం.. కానీ సోషల్‌మీడియాలో ప్రకటిస్తూ కాదు. అది సరైన పని’ అంటూ తన కోపాన్నంతా వెల్లగక్కింది పాక్ కోడలైన భారత క్రీడాకారిణి.