లైంగిక ఆరోపణలు: ఆ దర్శకున్ని సినిమానుంచి తీసేశారు

00:05 - February 14, 2019

*గట్టిగా వాటేసుకొని కోరిక తీర్చుకునే వాడు

*దర్శకున్ని ప్రాజెక్ట్ నుండి తొలగించిన నిర్మాణ సంస్థ‌.

*సినిమాని పూర్తి చేసే బాధ్య‌త‌ అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ కి

 

 

లైంగికంగా వేధించ‌బ‌డ్డ మ‌హిళ‌లు నిర్భయంగా బ‌య‌ట‌కి వ‌చ్చి తాము ఎదుర్కొన్న విపత్క‌ర సంఘ‌ట‌న‌ల గురించి చెప్పిన మీటూ ఉధ్యమం ఇప్పుడు భారత దేశం లో తొలిసారిగా ఒక దర్శకుడి మీద వేటు వేసేలా చేసింది. మీటూ అంటూ వచ్చిన చైతన్యంతో బాలీవుడ్‌కి సంబంధించి ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో వారిని ప్రాజెక్ట్ నుండి తొలగించింది చిత్ర నిర్మాణ సంస్థ‌.

 కంగనా తో క్వీన్ అనే సినిమా తీసిన దర్శకుడు వికాస్ బాల్.  "ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నేను తొందరగా పడుకునే దాన్ని దాంతో నాపై సెటైర్ లు వేసేవాడని, నేను అతడికి చిక్కలేదని అందుకే కలిసినప్పుడు నన్ను గట్టిగా వాటేసుకొని కోరిక తీర్చుకునే వాడని సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా.  అంతేకాదు వికాస్ బాల్ కు పెళ్ళి అయినప్పటికీ ప్రతీరోజు కొత్త మహిళటో శృంగారం చేయాలనీ పరితపించే వాడని, అలా చాలామంది ని వాడుకున్నాడని తెలిపింది. ఆ ఆరోపణల్లో నిజం  తేలటంతో సూపర్ 30 ప్రాజెక్ట్ నుంచి అతన్ని తప్పించారు. 


 ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వికాస్ బాల్ ప్ర‌ముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా సూప‌ర్ 30 అనే సినిమాని మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా పాట్నా బేస్డ్ మ్యాథమేటిషియన్ - విద్యావేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది.  'సూపర్ 30' ప్రోగ్రామ్ ద్వారా ఎకనామిక్ గా వీక్ గా ఉండే పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఐఐటీ లో ప్రవేశం లభించేలా చేయడం ద్వారా అయన దేశం దృష్టి ని ఆకర్షించాడు.  అంతే కాకుండా ఆనంద్ కుమార్ గణిత శాస్తంలో చేసిన రీసెర్చ్ పేపర్స్ ప్రఖ్యాత అంతర్జాతీయ గణిత మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.

ఈ ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'సూపర్ 30'  ఈ సినిమా మొద‌లు పెట్టిన కొద్ది రోజుల‌కే ఆయ‌నపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల నుండి అత‌నిని త‌ప్పించారు. దీంతో సినిమాని పూర్తి చేసే బాధ్య‌త‌ని అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ తీసుకున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని అనురాగ్ క‌శ్య‌ప్ చూస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే జూలై 26న విడుద‌ల కానున్న ఈ చిత్రం టైటిల్ కార్డ్స్‌లో ద‌ర్శ‌కుడి పేరు ఉండ‌ద‌ని చిత్ర నిర్మాణ సంస్థ రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ మేనేజ‌ర్ తెలిపారు. ఎంద‌రికో స్పూర్తిని క‌లిగించిన ఆనంద్ కుమార్ బ‌యోపిక్‌లో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు .