కొత్త ఇంటికి తీసుకువస్తే ప్రాణాలు తీసింది :"సెలబ్రిటీ" ఏనుగు విధ్వంసం

22:30 - February 9, 2019
*గృహ ప్రవేశంలో ఏనుగు విధ్వంసం 
*ఆ ఏనుగుకి వేలాది మంది అభిమానులున్నారు 
*ఇప్పటికే 11మంది మనుషులు, ౩ ఏనుగులను చంపేసింది 

 

నమ్మకాలు ఒక్కోసారి ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఒక్క ఉదాహరణ చాలు. మామూలు సాంప్రాదాయానికి భిన్నంగా కొత్తగా ఆలోచిద్దాం అనుకున్నాడేమో కానీ దారునం జరగబోతుందని ఊహించలేకపోయాడు ఆ యజమాని. కొత్తగా కట్టిన ఇంటిలోకి ఆవుని తెస్తే శుభం అన్నారు కదా ఏకంగా ఏనుగునే తీసుకు వస్తే ఇంకా గొప్ప మేలు జరుగుతుందనుకున్నాడేమో గానీ కొత్త ఇంటి ప్రాంగణాన్ని రక్తసిక్తం చేసుకున్నాడు.  
 ఇంతకీ ఏం జరిగిందీ అంటే కేరళ రాష్ట్రంలోని "గురువాయూర్ కొట్టపడి"లో షైజు అనే వ్యాపారి కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. కొత్తైంటి ప్రవేశాన్ని వేడుకలాగా చేద్దామని  బంధువులు, స్నేహితులను పిలిచి గృహప్రవేశం కూడా ఏర్పాటు చ్రేసాడు.

గృహప్రవేశం సందర్భంగా గోమాతను తీసుకురావటం కామన్ కదా అని కాస్త గ్రాండ్ గా ఆలోచించాడు, ఏనుగుతో గృహప్రవేశం చేస్తే గ్రాండ్ గా ఉంటుందనుకున్నాడో ఏమో కోసం గురువాయూర్ లోని దేవాలయం నుంచి 54 ఏళ్ల వయసు గల రామచంద్రన్ అనే పేరుగల ఏనుగుతో ఇంటిలోకి ప్రవేశించే ప్రయత్నం చేసాడు.  అయితే  గృహప్రవేశ మహోత్సవం జరుగుతుండగా, పక్కింట్లో ఉన్న ఒకరు బాణసంచాను కాల్చారు ఆ శబ్దానికి బెదిరిన ఏనుగు కాస్తా వేడుకకు వచ్చిన అతిధులపైకి దూసుకువచ్చింది.

పాపం మావటి ఎంతప్రయత్నించినా ఏనుగుని కంటోల్ చేయలేకపోయాడు. (బీహార్ లో పెరిగిన ఈ ఏనుగుకు ఇచ్చే ఆదేశాలు, మళయాల మావటీలు ఉపయోగించే భాషకూ తేడా ఉండటం వల్లనే మావటి ఇచ్చే ఆదేశాలని ఏనుగు వినిపించుకోలేదని స్థానికుల వాదన),  అంతే గృహప్రవేశానికి వచ్చిన అతిధి నారాయణ పెట్టేరి (66) ఏనుగు తొక్కిసలాటలో అక్కడికక్కడే మరణించాడు. మరో అతిధి మరుగన్ (60) తీవ్ర గాయాలతో కున్నంకులం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఏడుగురు అతిధులు గాయపడ్డారు. 
 
నినిజానికి ఈ 54 ఏళ్ల వయసు గల రామచంద్రన్  అనె ఏనుగు కేరళాలో చాలానే పాపులర్. దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫేస్బుక్ పేజ్ లు కూడా ఉండటం గమనార్హం. అయితే దీనికి ఒక కన్ను కనిపించదు. అంతే కాదు దీని ట్రాక్ రికార్డ్ కూడా ఘనంగానే ఉంది ఈ సంఘటన కాకుండానే ఈ ఏనుగు ఇప్పటికే పదకొండు మంది మనుషులు, మూడు ఏనుగుల మృతికి కారణమయ్యింది.  గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా భారీ ఊరేగింపులకు ఏనుగులను వినియోగించరాదని కేరళ హైకోర్టు కొన్ని నిబందనలు విధించినా, దాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.  మొత్తానికి ఒక నమ్మకం ఇంత విధ్వంసానికి కారణం అయ్యింది.