ఆవు మాంసం తినిపించారు, పరిహారానికి భారత దేశం పంపండి

02:58 - March 13, 2019

 *మీ కంపెనీ ప్యాకింగ్ పొరపాటు వల్లనే బీఫ్ తిన్నాను  

*శుద్ధి క్రతువు చేయటానికి భారత్ దేశానికి పంపండి

*న్యూజిలాండ్ ఫుడ్ కంపెనీపై భారతీయుడి కంప్లైంట్  

 

వినియోగ దారులతో ఉద్దేశ పూర్వకంగానో, పొరపాటునో మోసపూరితంగా ప్రవర్తించిన కంపెనీలకు. ఎదురు దెబ్బలు తగలటం సర్వ సాధారనమే. కొన్నేళ్ళకిందట అమెరికాలో ఫలానా కంపెనీ సిగరెట్ల వల్లనే తన ఆరోగ్యం పాడైందని, ఆ కమెనీ ప్రకటనల వల్లే తాను ఆ సిగరెట్లకి ఆకర్శితుడయ్యాననీ ఒక సిగరెట్ కంపెనీ మీద కేసు పెట్టిన ఒక వ్యక్తి మిలియన్లలో నష్టపరిహారాన్ని పొందాడు. విదేశాల్లో ఇలాంటివి మామూలే. 


     అయితే ఈసారి న్యూజిలాండ్‌లోని  కౌంట్‌డౌన్‌లో ఒక ఫూడ్ కంపెనీకి కొత్త తరహా కంప్లైంట్ తో బుర్రగోక్కునేలా చేస్తున్నాడు  జస్వీందర్ పాల్ అనే ప్రవాస భారతీయుడు. పోయిన సంవత్సరం సెప్టెంబరులో ఓ సూపర్ మార్కెట్‌లో మాంసం ప్యాకెట్ కొన్నాడు జస్విందర్. అయితే ప్యాకింగ్ పొరపాటువల్ల దానిపై గొర్రె మాంసం అని రాసి ఉన్నా, ఆ ప్యాకెట్ లోపల ఉన్నది మాత్రం మాత్రం బీఫ్. అయితె ప్యాకెట్ తీసుకుని ఇంటికి తీసుకెళ్లి, వండుకుని తినేటప్పుడు జస్వీందర్ అసలు విషయం అర్థం చేసుకున్నాడు. తాను తిన్నది గొర్రె మాంసం కాదని అది తాను పవిత్రంగా భావించే ఆవు మాంసమని నిర్ధారించుకుని సూపర్‌మార్కెట్ యాజమాన్యం వద్దకు వెళ్లి విషయం చెప్పాడు.


అతని కంప్లైంట్ మీద  ఆరా తీసిన యాజమాన్యం జస్విందర్ చెప్పింది నిజమే ననీ అయితే ఆ పొరపాటుకు తాము పొరపాటుకు గానూ నష్టపరిహారం కింద 200 డాలర్ల గిఫ్ట్ ఓచర్‌ను ఇస్తామని బుజ్జగించబోయింది.కానీ మనోడు మాత్రం  అవి వద్దని, తాను పవిత్రమైన ఆవు మాంసం తిన్నందుకు తన మతం ప్రకారం చేసుకోవాల్సిన శుద్ది ఖర్మలకు గానూ అయ్యే ఖర్చులతో సహా తనను సదరు కంపెనీ ఖర్చులపై భారత దేశానికి పంపాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు.

 ఆవు మాంసం తిన్నందుకు కుటుంబ సభ్యులు తనతో మాట్లాడ్డం లేదని, తీవ్ర నసిక వేదన అనుభవిస్తున్నానని చెప్పిన జస్విందర్. తాను ఆరు వారాలు భారత్‌లో పాప పరిహార పూజలు చేయాల్సి ఉందని, ఆ ఖర్చులన్నీ ఆ కంపెనీయే చెల్లించాలనీ కూర్చున్నాడు. ఎంతైనా మనోళ్ళు మహా తెలివైన మొండి వాళ్ళు కదా దాంతో ఇప్పుడు స్వ్త్ఝర్లాండ్ లోని ఆ ఫుడ్ కమెనీ పెద్దలు తలలు పట్టుకు కూర్చున్నారట.