మీ ఓటే మా పెళ్లి గిఫ్ట్; "ఆప్" కోసం హర్యానా జంట వినూత్న ప్రచారం

05:08 - January 19, 2019

పెళ్లికి వెల్తే మీరేం గిఫ్ట్ తీసుకు పోతారు? ఒకప్పుడంటే చదివింపుల్లో డబ్బుతో పాటు కొత్త దంపతులకు అవసరమయ్యే వస్తువులను ఇచ్చేవాళ్ళు. వాటిలో ఇత్తడి బిందెలనుంచీ బంగారు నగల వరకూ ఉండేవి. ఇప్పుడైతే పోష్ గా ఒక బొకే ఏదైనా షోపీస్ లేదంటే లేటెస్ట్ ట్రెండ్ గా షాపింగ్ గిఫ్ట్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ పెళ్ళిజంట మాత్రం వాళ్ళ పెళ్ళికి వచ్చే బందువులందరినీ ఒక వింత గిఫ్ట్ కోరింది. అదేమిటంటే తమ పెళ్ళికి గిఫ్ట్ గా "ఆమ్ ఆద్మీ పార్టీకి" ఓటు వెయ్యమని కోరింది. ఈ మేరకు వెడ్దింగ్ కార్డ్ లోనే ఆ మాట కూడా అచ్చు వేసారు. 
 
 హర్యానాలోని ఓ జంట మాత్రం తమ పెళ్లికి వచ్చే అతిథులను ఓ వింత గిఫ్ట్ కోరింది. మా పెళ్ళికి వచ్చే వారంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి చాలు.. మీరు మాకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే అంటూ తమ పెళ్లి పత్రికలో అచ్చు వేయించారు. అంటే కాదు ఆ ఫోటోలను  అంకిత్ లాల్ ట్విటర్‌లో షేర్ చేశారు. 2019 లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో ఆప్‌కు ఓటేయండి.. ఆ ఓటే మాకు గిఫ్ట్ అని ఆ పెళ్లి కార్డుపై ఉంది.

 ఆ కార్డుపై ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు గోపాల్ రాయ్, నవీన్ జైహింద్‌ల ఆటోగ్రాఫ్‌లు కూడా ఉన్నాయి. హర్యానాలో ప్రతిచోటా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీ చెప్పుకుంటున్నది. గత నవంబర్‌లో ప్రధాని మోదీకి ఓటేయండంటూ ఇలాగే కొన్ని వెడ్డింగ్ కార్డులు వచ్చాయి. పార్టీ ప్రచారాల్లో ఇదో కొత్త ట్రెండ్ అయ్యి, కొన్నాళ్ళాగితే పెళ్ళి భోజనాలు లేదంటే ఏకంగా స్పాన్సర్ చేసి తమ పార్టీ బ్యానర్ కట్టేసే రోజులూ రావచ్చేమో.