సుప్రీం తీర్పు: హార్దికపటేల్‌ లోక్‌సభకు పోటీ చేస్తారా...?లేదా...?

13:36 - April 2, 2019

పటేల్‌దార్‌ ఉద్యమనేత హార్దికపటేల్‌ లోకసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సుప్రీం తీర్పు కీలకంగా మారింది. వివరాల్లోకి వెలితే...2015లో జరిగిన ఓ దాడి కేసులో హార్దిక్‌కు రెండేళ్లు జైలు శిక్ష పడింది. అయితే ఇప్పుడు ఆ కేసును అత్యవసరంగా విచారించాలని హార్దిక్‌ పిటీషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే సుప్రీం దాన్ని పక్కనపెట్టిందట. దీనికి ముందు ఈ కేసును హైకోర్టులో కొట్టేయడం జరిగింది. తరువాత తప్పని పరిస్థితిల్లో హార్దిక్‌ సుప్రీంను ఆశ్రయించారు. కానీ ఇక్కడ కూడా హార్ధిక్‌కు చుక్కెదురైంది. ఇప్పుడు దాని విచారనకు అంత తొందరేంటి అని సుప్రీం హార్దిక్‌ను ప్రశ్నించిందట. కానీ అసలు విషియం ఈ తీర్పుపైనే ఆధారపడి వుంది. అదేంటంటే...ప్రజా ప్రాతినిధ్యం ప్రకారం రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడినవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి ఇప్పుడు సుప్రీం తీర్పుపైనే హార్దిక్‌ లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేస్తాడా...? లేదా...? అన్న విషియం ఆధారపడి వుంది. ఏప్రిల్‌ 4కి నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఆ లోపు సుప్రీం హార్దిక్‌ కేసుపై తీర్పు ఇవ్వాల్సి వుంటుంది. మరి ఆలోపు తీర్పు వస్తుందా...? లేదా...? అన్నది వేచి చూడాల్సిందే.