24 ఎఫ్‌ఐఆర్‌లు, రెండేళ్ళ జైలు శిక్ష : హార్థిక్ పటేల్ ఆశలపై హైకోర్ట్ నీళ్ళు

15:09 - March 30, 2019

*హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్

 *2015లో ఓ అల్లర్ల కేసులో చుక్కెదురు 

*హార్దిక్‌పై 24 ఎఫ్‌ఐఆర్‌లు, రెండు దేశ ద్రోహ కేసులు

 

పాటిదార్ ఉద్యమ నేత, ఇటివలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓ కేసులో తనకు విధించిన రెం డేండ్ల జైలు శిక్షపై స్టే విధించాలన్న ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన ఆకాంక్షలకు ఈ తీర్పు అవరోధమైంది. .గుజరాత్ లో పటిదార్ లు ఎక్కువగా ఉన్న మహాసాన లేదా అమ్రెలీ స్థానాల నుండి పోటి చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు . 


 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్‌ పటేల్‌పై 17 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని గుజరాత్‌ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్‌కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్‌ పటేల్‌పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 

                                                               
పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్‌ పటేల్‌ కార్యాలయంపై దాడిచేశారు.ఈ కేసును విచారించిన విస్‌నగర్‌ సెషన్స్‌ కోర్టు హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది.  దీనిపై స్టే ఇవ్వాలన్న హార్దిక్ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. 

                                                        
హార్దిక్‌పై 24 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, రెండు దేశ ద్రోహ కేసులు కూడా ఉన్నాయన్నది. మార్చి 8న తనపై ఉన్న ఈ శిక్షను రద్దు చేయాలని హార్దిక్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు హార్దిక్ న్యాయవాదులు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేండ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు. ఈ నేపథ్యంలోనే హార్దిక్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన హార్దిక్‌ జామ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్‌నగర్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు.