గోపీచంద్‌ సినిమాలో నటించనన్న హీరోయిన్స్‌...

14:41 - January 25, 2019

యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్ గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. ఆయన చేసిన సినిమాలన్ని కూడా ఒక్కదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఎంత కష్టపడి చేసినా - ప్రయోగాత్మకంగా చేసినా కూడా గోపీచంద్ కు సక్సెస్ అనేది కష్టం అయ్యింది. ఈ నేపథ్యంలోనే  ప్రస్తుతం గోపీచంద్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను తాజాగా ఇండియా - పాకిస్తాన్ బోర్డర్ లో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. అయితే... ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం లక్ష్మీ రాయ్ మరియు హంసా నందినిని సంప్రదించారట. వీరిద్దరు కూడా భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాత షాక్ అయ్యాడట. గోపీచంద్ కు ఈమద్య కాలంలో సక్సెస్ లు లేవు కనుక - ఆ హీరోతో నటించడం అంటే సాహసమే - అందుకే ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిందిగా హంసా నందిని మరియు రాయ్ లక్ష్మిలు కోరినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు భారీగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో  ముద్దుగుమ్మ జరీన్ ఖాన్ ను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈమద్య కాలంలో రెండు మూడు సినిమాలతో అలరించిన జరీన్ ఖాన్ పారితోషికం విషయంలో కూడా నిర్మాతకు అందుబాటులో ఉందనే ఉద్దేశ్యంతో ఆమెను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.