గోవా వెలుతున్న వారు తప్పక ఈ రూల్స్‌ తెలుసుకోవాల్సిందే...!

13:48 - January 25, 2019

 ఆ రాష్ట్రం పేరు విన్నంతనే ఎంజాయ్ చేయటానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. అంతేనా.. పార్టీ చేసుకోవటానికి.. నచ్చినట్లుగా గడపటానికి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎన్నో రీజన్స్ ను చెప్పేస్తారు. అలాంటి కోవకే చెందింది గోవా. అలాంటి గోవాకు వెళ్లాలనుకున్న వారంతా ఇప్పుడీ వార్త చదివి...కొత్త రూల్స్‌ తెలుసుకోవాల్సిందే. గోవాలో కొత్త రూల్ పెట్టారు. అదేమంటే.. బీచ్ లో మద్యం తాగినా.. పబ్లిక్ గా వంట చేసినా రూ.2వేల ఫైన్ వేయాలని గోవా రాష్ట్ర సర్కారు డిసైడ్ అయ్యింది. ఈ కొత్త నిర్ణయాన్ని తాజాగా జరిగిన గోవా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  ఫైన్ కట్టని వారికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తామని పర్యాటక శాఖా మంత్రి అజ్ గోంకర్ వెల్లడించారు. పర్యాటకులకు స్వర్గ ధామంగా అభివర్ణించే గోవాలో ఇటీవల కాలంలో వస్తున్న కొందరు టూరిస్టుల కారణంగా మిగిలిన పర్యాటకులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టే పనిలో భాగంగా ఆ రాష్ట్ర సర్కారు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇదిలా ఉంటే.. గోవా బీచుల్లో ఫుట్ పాత్ లపై మద్యం తాగటం.. బాటిళ్లు పగలకొట్టటం.. దుస్తులు లేకుండా పరుగులు తీయటం లాంటి పనుల్ని కూడా నిషేధించాలని కోరారు. అయితే.. వీటి మీద మాత్రం నిర్ణయం తీసుకోలేదు.