ముఖంమంతా మెరిసేలా కావాలంటే...

17:22 - January 9, 2019

 

చాలామందికి ముఖం లేదా శరీరం అంతా ఒకే రంగులో ఉండదు. ముఖాన్నే తీసుకుంటే నోటిచుట్టూనో నుదుటిమీదనో, చెంపలపక్కనో మెడమీదో మిగిలిన భాగాలకన్నా నల్లగా ఉంటుంది. ఆయా భాగాలకు ఎక్కువ గా సూర్యరశ్మి సోకడమో లేదా హైపర్‌ పిగ్మెంటేషనో హార్మోన్ల అసమతుల్యత దీనికి కారణమవుతాయి. అలాంట ప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.  

- రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా పసుపు, చిటికెడు నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేస్తే సరి.

- ఒక చెంచా కొబ్బరినూనె, ఒక చెంచా చక్కెర, అర చెంచా నిమ్మరసం బాగా కలిపి ముఖానికి మాస్క్‌లా వేసి మృదువుగా రుద్దాలి. ఓ అరగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంమీద ఉన్న మచ్చల్నీ, పిగ్మెంటేషన్‌నీ మృతకణాల్నీ తొలిగించి ముఖమంతా తెల్లగా మెరిసేలా చేస్తుంది. 

- రెండు చెంచాల పాలపొడిలో ఒక చెంచా నారింజ రసం కలిపి ముఖానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేసినా మంచిదే.

- ఒక చెంచా ముల్తానీ మట్టి, ఒక చెంచా తులసి ఆకుల పొడి, ఒక చెంచా వేపాకు పొడి, ఒక చెంచా రోజ్‌ వాటర్‌ కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.