ఎవరెస్ట్ మీద బయటపడుతున్న వందల శవాలు: భయపెడుతోన్న గ్లోబల్ వార్మింగ్

15:59 - March 24, 2019

*వేగంగా కరుగుతున్న ఎవరెస్ట్ శిఖరం 

*బయట పడుతున్న మంచులో గల్లంతయిన వందల శవాలు 

*భయపెడుతోన్న గ్లోబల్ వార్మింగ్, పెను ముప్పు ముంగిట్లో ఉన్నాం 

 

మనకు తెలియకుండానే అనుకున్నదానికంటే వేగంగా ప్రమాదం లోకి నెట్టబడుతున్నాం. భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది, ఫలితం... మనం ఊహించలేనంత దారునం. హిమాలయాల్లోనూ, దృవాల వద్దా ఉన్న మంచుకరిగిపోయి నదుల్లోకి ప్రవహించి సముద్రంలో చేరిపోతోంది దాని ద్వారా సముద్రమట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. భూమి మీద మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. సరే ఇప్పుడు ఆ ధారునాన్ని పక్కన పెడితే  ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరాల్లో ఒకటి అనిపించుకున్న  ఎవరెస్ట్‌పైన ఉండే మంచుకూడా చాలా వేగంగా కరిగిపోతున్నది. 


 అయితే ఈ మంచు కరిగే కొద్దే. శిఖరంపై మంచులో కూరుకు పోయి ఉన్న శవాలు ఒక్కొక్కొటిగా బయటపడుతున్నాయి. మంచులో ఉండటం వల్ల దాదాపుగా శవాలు మొత్తంగా పాడవవు పాక్షికంగా దెబ్బ తింటాయి తప్ప చాలావరకూ అలాగే ఉంటయి. ఇవన్నీ ఒకప్పుడు ఎవరెస్ట్‌ను జయించడానికి ప్రయత్నించి మధ్యలోనే ప్రాణం విడిచి గల్లంతయిన సాహస యాత్రికులవే. 1922 నుంచి ఇప్పటివరకు ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించి కనిపించకుండాపోయిన వాళ్ళ సంఖ్య దాదాపు రెండువందలమంది. అయితే వీళ్లందరి శవాలు ఇంకా దొరకలేదు. ఇప్పుడు మంచు కరుగుతుండటంతో అవి బయటపడుతున్నాయి. ఈ శవాల్లో కొన్ని 1970ల్లో వచ్చిన బ్రిటిష్ యాత్రికులవిగా గుర్తించడం విశేషం. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయట

వాతావరణ మార్పుల కారణంగా మంచుకరిగిపోవటంతో అందులో ఇన్నాళ్ళుగా కప్పబడ్డ శవాలు బయటపడుతున్నాయి అని ఆంగ్ షెరింగ్ అనే షేర్పా చెప్పారు. 2008 నుంచి ఇలా తమ వ్యక్తులు ఏడుగురి శవాలను కిందికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఎవరెస్ట్‌పై ఉన్న మంచు వేగంగా కరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు నేపాల్ నేషనల్ మౌంటేన్ గైడ్స్ అసోసియేషన్ అధికారి సోబిత్ కున్వర్. ప్రతి ఏడాది మీటరు మేర గ్లేసియర్లు కరుగుతున్నాయని చెప్పారు. దీనిద్వారా బయటపడుతున్న శవాలు కొన్నింటిని కిందికి తీసుకొస్తుండగా.. తీసుకురాలేని పరిస్థితుల్లో మరికొన్నింటిని అక్కడే వదిలేస్తున్నారు. ఎవరెస్ట్‌పై నుంచి శవాలను కిందికి తీసుకురావడం ప్రమాదమే కాదు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఇప్పుడు శవాలను తీసుకు రావటం పైన కాదు ఆందోళన ఈ మంచు కరిగిపోవటం అలాగే కొనసాగిందంటే హిమాలయాల నుంచీ ప్రవహించే నదులవల్ల వరదలు వచ్చే అవకాశం ఉంది, ఇప్పటివరకూ భారత్, చైనా, పాక్ లాంటి దేశాలు దీనివల్ల విపరీత ప్రభావాలకు లోనుకావొచ్చు. సముద్ర మట్టాలు పెరగటం కూడా ఎంత ప్రమద కరమో తెలిన్సిందే కదా...