కమాన్ బాయ్స్ : "చిత్ర‌ల‌హ‌రి" రెండో లిరికల్ సాంగ్ రిలీజ్ (వీడియో)

22:17 - March 24, 2019

 

 

 

 

 

 

 

 

 

*"చిత్ర‌ల‌హ‌రి" రెండో లిరికల్ సాంగ్ రిలీజ్ 

*రియల్ రిలేషన్ షిప్పే.. గ్లాస్ మేట్సూ గ్లాస్ మేట్సూ

*ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల

 

‘‘కమాన్ బాయ్స్..
స్కూల్‌కెళ్లే వరకేరా క్లాస్ మేట్స్.. రెంట్ కట్టే వరకేరా రూమ్ మేట్సూ..
వీకెండ్ వచ్చె వరకేరా ఆఫీస్ మేట్స్.. లైఫ్ ఎండ్ అయ్యే వరకేరా సోల్ మేట్సూ..
అరె ఎండంటూ లేని.. బెండంటూ కానీ.. రియల్ రిలేషన్ షిప్పే.. గ్లాస్ మేట్సూ గ్లాస్ మేట్సూ..’’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసింది "చిత్ర‌ల‌హ‌రి" టీమ్. సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రలహరిలో రెండో ఆడియో సింగల్ విడుదలైంది.

మొన్నటి నుంచే ప్రమోషన్ లో ఇది మందు తాగే స్నేహితుల పాటగా ప్రమోట్ చేయడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి.  సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే ‘పరుగు పరుగు’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ ఆదివారం ‘గ్లాస్‌ మేట్స్’ అనే మరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే ‘పరుగు పరుగు’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ ఆదివారం ‘గ్లాస్‌ మేట్స్’ అనే మరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది.రంగస్థలం తర్వాత మెగా హీరోతో మైత్రి సంస్థ నిర్మించిన మూవీ కావడంతో అంచనాలు భాగానే ఉన్నాయి.