గీత-గోవిందం టాక్ ఏంటీ?!

00:39 - August 18, 2018

           గీతా గోవిందం మూవీకోసం టాలీవుడ్ అంతా ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూసింది.  హిట్ పాటలతో.. మాంచి ట్రైలర్స్ తో ఇంప్రస్ చేసి మూవీపై క్యూరియాసిటీ పెంచింది. ఇగ ఇప్పడు రిలీజ్ కూడా ఐపోయింది.  సహజంగానే టాక్ ఏంటీ? ఎలా ఉంది?  అని తెలుసుకోవాలనుకుంటారు సామాన్య ప్రేక్షకులు.

   అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉన్న డీసెంట్ విజయ్ దేవర కొండ. హీరోయిన్ ని చూడగానే ప్రేమిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావం వలన హీరోని అపార్థం చేసుకుంటుంది. హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు, అనుమానాలు  తొలిగిపోతాయా, లేదా, హీరో హీరోయిన్ ల మధ్య బాండిగ్ ఎలా డెవలప్ అవుతుంది. అనే కథతో వచ్చిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ నటనకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ రష్మిక కూడా తన బాగాఆకట్టుకుంది. 

    ఇక గోపీ సుందర్ మ్యూజిక్ ఓ ఊపు ఊపేసింది. ఇంకేం కావాలే సాంగ్ తోనే గీతగోవిందం పై అంచానాలు పెరిగాయి..విజయ్ దేవరకొండు మొదటి సారి ఈ మూవీలో సాంగ్ పాడాడు. పరశురాం డైరక్షన్ రొటీన్ కు బిన్నంగా బాగుంది. నిత్యామినన్, అను ఇమ్మాన్యూయల్  సర్ప్రైజ్ బాగుంది. సీనియర్ నటులు సాల్లల్లో నీళ్లలాగా ఒదిగిపోయారు.  వెన్నెలకిషొర్ కామెడీకి థియేటర్ లో విజిల్లు పడ్డాయి. మొత్తంగా గీతగోవిందం సినిమా విజయ్ కు మరో హిట్ అందిస్తుందని చెప్పుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.