నారాయణ స్కూల్ లో అగ్ని ప్రమాదం (వీడియో)

01:42 - February 21, 2019

 

 

 

 

 

 

 

హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని నారాయణ స్కూలు విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో బుధవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్కూలులోని ఓ తరగతి గదిలో ఉన్న ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూలు మొత్తం పొగ వ్యాపించింది. ఏం జరుగుతుందో తెలియని సిబ్బంది, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా పాఠశాలలలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విద్యా్ర్థులు, టీచర్లు, పాఠశాల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పేశారు. అయితేఅద్రుష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.