ఎఫ్2 మేకింగ్ వీడియో: నవ్వుల సంక్రాంతి వస్తున్నట్టేనా

07:20 - January 12, 2019

 

 

 

 

 

 

 

 

              పండగ సినిమా రేసులో ఈసారి వచ్చిన రెండు సినిమాలూ పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. క్రిష్, నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ "కథానాయకుడు" అంతంతమాత్రమే ఫలితన్నివ్వగా, బోయపాటి, రామ్ చరణ్ కాంబో "వినయ విధేయ రామ" అట్టర్ ఫ్లాప్ అనే పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ, ప్రేక్షకులూ ఎదురు చూసేది ఎఫ్2 కోసమే. పండుగ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పక్కా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్2. ఈ చిత్రంలో వెంకటేష్ భార్య బాధితుడిగా.. వరుణ్ తేజ్ ప్రేమికురాలి బాధితుడిగా నటించారనేది సమాచారం.

తమన్నా గయ్యాలి భార్యగా వెంకటేష్‌ను రఫ్ ఆడించే పాత్రలో కనిపించనున్నారు. మెహ్రీన్ అందమైన ప్రియురాలిగా వరుణ్‌తో జతకట్టింది. ఈ జంటల మధ్య కామెడీ బ్రహ్మండంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ రోజు విడుదల కానున్న ఈ సినిమా అయినా టలీవుడ్ సంక్రాంటి సీజన్ ని గెలుచుకుంటుందా అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది. 

              అయితే ముందు ఉన్న రెండు భారీ సినిమాల పైనే అందరి దృష్టీ ఉందటంతో సంక్రాంతి సినిమాల్లో ముందు నుంచి ఈ సినిమాపై తక్కువ అంచనాలు ఉన్నాయి. అయినా కూడా దిల్ రాజు చాలా నమ్మకంగా ఈ చిత్రాన్ని పండగ సెలవుల్లోనే తీసుకొస్తున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 జనవరి 12న విడుదల కానుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై అభిమానులు కూడా భారీ ఆశ‌ల‌తో ఉన్నారు.


     దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ నిరూపించింది. సంక్రాంతి రేసులో ఈరోజు (జనవరి 12) న రిలీజ్ కానున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ ఇవాళ రిలీజ్ చేసింది. సినిమా చూసేముందు కాస్త ఈ మేకింగ్ వీడియోను చూసేయండి. కడుపు నిండిపోయే కామెడీని పట్టుకొచ్చేస్తున్నారని అర్థమైపోతోంది. సొ ఈసంక్రాంతి విజేత "ఫన్ అండ్ ఫ్రస్టేషన్" అనుకోవచ్చా లేదా అన్నది కాసేప్ట్లో తెలిసిపోతుందన్న మాట.