బడిలో పేలిన బాంబులు : దద్దరిల్లిన పుల్వామా

15:33 - February 13, 2019

*బడిలో పేలిన బాంబులు 

*జమ్మూ కాశ్మీర్ లో ఘాతుకం 

*క్షతగాత్రులైన విద్యార్థులు 

 

 

జమ్మూ,కాశ్మీర్ లోని 22 జిల్లాలలో పుల్వామా ఒకటి. ఎప్పుడూ యుద్ద వాతావరణం  ఉండే పుల్వామా మళ్ళీ ఒకసారి బాంబుపేలుళ్ళతో దద్దరిల్లింది. టౌన్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు ఘటనలో 10వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. పేలుడుకు ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.  ఈ పేలుళ్ల ధాటికి పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

పేలుళ్ల శబ్దం విన్న కొందరు విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తీవ్రవాదులకూ, ఇండియన్ ఆర్మీకీ మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆర్మీ దాడులు చేయటం, దానికి ప్రతీకారంగా తీవ్రవాదులనుంచి ప్రతిఘటనలు ఎదురుకావటం సర్వసాధారణం అయిపోయింది.