బ్రిటన్ లో అల్లర్ల భయం: రాజకుటుంబాన్ని తరలిస్తున్నారు

23:50 - February 7, 2019
*అల్లర్ల భయంలో బ్రిటీష్ రాజధాని 
 
*రహస్య స్థలానికి రాజకుటుంబం తరలింపు? 
 
*యురోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకే బ్రిటన్ నిర్ణయం?
 

 

 

 

 

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగేందుకు బ్రిటన్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బ్రిటన్ లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే లండన్‌లోని బకింగ్‌హాం ప్యాలెస్  నుంచి క్వీన్ ఎలిజబెత్-2తోపాటు రాజకుటుంబాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని బ్రిటన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందట. 28 సభ్య దేశాలున్న ఈయూ నుంచి ఎటువంటి చర్చలకూ తావులేకుండానే బ్రిటన్ వైదొలగడం వల్ల అల్లర్లు ఖాయమని భావిస్తున్నారు. దీంతో రాజకుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం రహస్య ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ‘సండేటైమ్స్’ పేర్కొంది.

ఇంతకీ ఏమిటీ యూరోపియన్ యూనియన్? ఎందుకు బ్రిటన్ దానినుంచి బయటపడాలనుకుంటోందీ అంటే.... 

బ్రిటన్ లో కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ "యూరోపియన్ యూనియన్ పట్ల ఎంతో కొంత విముకత తోనే ఉంది. యూరపియన్ యూనియన్ లో సభ్యులుగా ఉన్న బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర అభివృద్ధి చెందిన దేశాలు, యూరోప్ లో పేద దేశాల అభివృద్ధి కోసం ప్రతీ ఏటా భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. అయితే ఈ దేశాలతో పోల్చుకున్నప్పుడు బ్రిటన్ అభివృద్ది వేగంగా ఉందటం వల్ల మిగతా వాటికన్నా బ్రిటన్ చెల్లించేమొత్తం భారీగా ఉందటంతో  బ్రిటన్ వాటాగా చాలా ఎక్కువ చెల్లించవలసి వస్తోంది. ఆ కారణంగా యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం బ్రిటన్ కి గుది బండగా మారిందని బ్రిటన్ లో చాలా మంది భావించడం ఒక కారణం.


ఇది పక్కకు పెడితే యూరోపియన్ యూనియన్ లో భాగం కావటం వల్ల  చైనా వంటి వేరే దేశాలతో బ్రిటన్ వర్తక, వాణిజ్య సంబంధాలకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల బారీగా ఆర్ధిక నష్టం కూడా బ్రిటన్ భరించవలసి వస్తోంది, అయితే ఈ వాదన మాత్రం నమ్మసక్యం కానిదే ఎందుకంటే గత ఆర్ధిక సంవత్సరంలో బ్రిటన్ సుమారు 14.9 బిలియన్ పౌండ్లు చైనాకి ఎగుమతులు చేయగా, దానికి 5 రెట్లు అంటే 74.5 శాతం జర్మనీ ఎగుమతి చేసింది.

యూరోపియన్ యూనియన్ లో వివిధ దేశాలకి చెందిన వారు ఏ దేశంలోనైనా స్వేచ్చగా ఉద్యోగం చేసుకోవచ్చు, స్థిరపడవచ్చు. ఈ నియమాల వల్ల మామూలుగానే ఆర్థికంగా బలంగా ఉన్న బ్రిటన్ వలస ప్రజలతో వేగంగా నిండిపోతోంది. స్థానిక ప్రజలతో సమానంగా అన్ని హక్కులు, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, సంక్షేమ పధకాలను వలస వచ్చినవారు  పొందవచ్చు. అంతే కాదు వారికి బ్రిటన్ పౌరులతో సమానంగా ఓటు హక్కు కూడా ఉంటుంది. దీనివల్ల స్థానికంగా ఉన్న బ్రిటన్ యువత వారి ఉధ్యోగ అవకాశాలను కోల్పోవలసి వస్తోంది.

అంతేకాదు యూనియన్ సభ్య దేశాలలో చెందిన పౌరుడు ఎవరైనా బ్రిటన్ లో తీవ్ర నేరానికి పాల్పడితే అతనిని బ్రిటన్ చట్టాల ప్రకారం శిక్షించడానికి వీలు కావడం లేదు. కారణం "యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్" బ్రిటన్ పై అధికారం చెలాయించటమే. అందుకే వలసదారులు  తమకు అన్ని విధాల మద్దతునిస్తున్న నిగెల్ ఫరాగే నేతృత్వంలోని యు.కె. ఇండిపెండెన్స్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హక్కులపై బ్రిటన్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విదించింది కానీ వాటిని తొలగించాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ భావిస్తున్నారు. ఇలా ఇన్ని రకాల కారణాలు బ్రిటన్ ప్రజల ఆగ్రహాన్ని మరింతగా పెంచేసాయి. 
      ఈ కారణాలవల్లనే బ్రిటన్ ఇప్పుడు (EU) యూరోపియన్ యునియన్ నుంచి  వైదొలగాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల దేశంలో అల్లర్లు జరిగే అవకాశమూ లేకపోలేదు అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాజ కుటుంబాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి తరలించాలని భావిస్తున్నారట.