భారత్ భవిష్యత్ ఏమిటి?

16:02 - May 23, 2019

 ప్రజాస్వామ్యం పేరుతో భారత దేశం మరొక్కసారి ఫాసిజం కోరల్లో చిక్కుకోనుందా? అయిదేళ్ళ అరాచకత్వం ఈసారి మరింత బలం పుంజుకొని దాడి చేయబోతోందా? దళితుల మీద దాడులు, మతాల సాకుతో బహిరంగంగానే మానవ హననాన్ని సమర్థించే వ్యాఖ్యలు, అయినా సరే మళ్ళీ ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తోంది.. ఇదంతా ఎలా సాధ్యమయ్యింది?? 
    అయిదేళ్ళ పాలన, లెక్కలేనన్ని దాడులు, నోరెత్తిన మేధావుల హత్యలు, బాహాటంగానే హంతకులకు మద్దతు తెలిపే భరోసా ప్రకటణలు, లెక్క లేనన్ని విమర్శలు, కేవలం అయిదు సంవత్సరాలలో రాజ్యంగ వ్యవస్తలన్నీ దుర్వినియోగం అయ్యాయి. "గుజరాత్ మోడల్" పాలన అంటూ ఫాసిజాన్ని శాంపిల్ గా మొత్తం దేశాని చూపించారు అయినా మళ్ళీ అదే పార్టీకి పట్టం.. ఇదంతా ఎలా సాధ్యమయ్యింది? ఎలక్షన్ కమీషన్ కూడా కుమ్మక్కయ్యిందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. రామమందిర నిర్మాణం మా లఖ్యం, హిందూ రాజ్య స్థాపనే మా ధ్యేయం అని చెబుతూ వచ్చిన బీజేపీ 2014లో కేవలం 33% మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అప్పటికే కాంగ్రేస్ తొమ్మిదేళ్ళ పాలనకి విసుగెత్తిన జనం చిన్న మార్పు కోరుకున్నారు.. "గుజరాత్ మోడల్" అనే మాయలో ఫాసిజానికి పట్టం కట్టారు. ఫలితం ఒక్కసారిగా భారత్ ఏకంగా మతతత్వ రాజకీయాలని నెత్తిన పెట్టుకున్నట్టయ్యింది. అయిదేళ్ళలో వందల దాడులు, వేల మరణాలు, వేసుకునే బట్టల మీద, ఆఖరికి తినే తిండి మీద ఆంక్షలు. దళితులు, మైనారిటీల మీద గతంలో ఎన్నడూ జరగనన్ని అకృత్యాలు. చాపకిందనీరులా హిందూత్వ ఎజెండా ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడింది. 

మొదటి నుంచీ ఆరెస్సెస్, వీహెచ్పీ భావజాలంతో నిండిపోయిన ఒక మతతవపార్టీ అసలు ఎలా అధికారంలోకి వచ్చింద్? కాంగ్రేస్ చేసిన తప్పిదాలేమిటి? అయిదే అయిదేళ్లలో కనీసం సగం సీట్లుకూడా సాధించలేని స్తితిలోకి వెళ్ళిపఒయిన కాంగ్రేస్ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందా?  వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ వైఖరి వల్ల విసిగిపోయిన ప్రజలకు మరో ప్రత్యామ్న్యాయంగా మాత్రమే బీజేపీ కనిపించింది. అప్పటికే మోడీ ని ఒక సూపర్ పవర్గా నిలబెట్టటానికి బీజేపీ దాని వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. కేవలం ఆనాటి ప్రచారానికే 5 వేల కోట్లు ఖర్చు చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఇక అంతకుముందు పాటించిన గుజరాత్, ముజఫర్ నగర్ హత్యాకాండలన్, వాటివెనుక ఆరెస్సెస్, హిందూత్వ శక్తుల హస్తాన్ని ప్రజలకు చూపించటంలో విఫలమయ్యింది హస్తం పార్టీ. ఇవన్నీ పరోక్షంగా బీజేపీ కి అప్పటి గెలుపుని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు కాంగ్రేస్ నుంచి బీజేపీకి వలస వచ్చిన వాళ్ళంతా మళ్ళీ తమ స్థానాల్లోనే పోటీచేసి గెలిచారు. 
         
    దక్షిణాదిలో అసలు ఉణికే లేని ఈ భావజాలం, అసలు ఏదో "నామ్ కే వాస్తే" అన్నట్టు ఉన్న పార్టీ ఇప్పుడు కమ్యునిస్ట్ ల కంచుకోట లాంటి కేరళలోనూ తన ఊడలని దింపుతోంది. ఏనాడూ మత ఘర్షణలు లేని కేరళలో కూడా  "అయ్యప్ప ఆలయం ఘటన" జరిగిందంటే అది ఎవరి వ్యూహమో ఊహించలేమా? అసలు మకర జ్యోతి అనేదే అబద్దం అని చెప్పినప్పుడు కూడా ఇంత ఘర్షణలు జరగలేదు. ఇక రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేసి మరీ అక్కడ కాంగ్రేస్ పరువు నిలపాలనుకున్నా సాధ్యంకానంత బలంగా నిలబడే స్థాయికి వచ్చింది. ఇక్కడా కాంగ్రేస్ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయ్యప్ప ఆలయం ఘటణలో కాంగ్రేస్ పాటించిన వ్యూహాత్మక మౌనం దాని ప్రతిష్టని మరింత మసకబారేలా చేసింది. రెండు నాల్కల దోరణి కేరళవాసులకు మరింత చిరాకు తెప్పించింది.
ఇటు దక్షిణాదినే కాదు అటు ఈశాన్య రాష్ట్రాలని తన వ్యూహంలోకి రప్పించుకుంటూనే ఇప్పటికే ప్రాభల్యం ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలోనూ మతవిద్వేశన్నీ, ఫాసిజాన్ని మరింతగా విస్తరిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే యోగీ ఆధిత్యనాథ్, ప్రఞ్ఙా సాధి లాంటి మతోన్మాద పావులని కదుపుతూ వచ్చింది. 

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రేస్ విఫలం అవటం కూడా అక్కడా బీజేపీ చొరబడే చాన్స్ ఇచ్చినట్టయ్యింది. దేశాన్నే కుదిపేసిన 1093 డిసెంబర్ 6 న జరిగిన బాబ్రీ మసీదు ఘటణ తర్వాతి ఘర్షణల ప్రభావం ఏమాత్రం చూపలేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్తితి వేరు. బెంగాల్ అంటే మరికొద్ది రోజుల్లో మతగర్శనలకు స్థానం ఆయే అవకాశలూ బలంగా ఉన్నాయి. ఇక గుజరాత్ లో బీజేపీ పై వచ్చిన వ్యతిరేకతని కూడా కాంగ్రేస్ వ్యూహాత్మకంగా వాడుకోవటంలో విఫలమయ్యింది.  ఎస్పీ, బీస్పీ కలయిక ఎన్నికలముందే జరగటం, బీజేపీ కాంగ్రేసెతర పార్టీల మధ్య ఐక్యత, ఎన్నికల కోసం మాత్రమే కావటం ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోయింది. ఫలితం యూపీ, ఉత్తరాంచల్లో కనిపించింది. 

  ఈశాన్య రాష్ట్రాలలో కూడా నెమ్మదిగా కాలుమోపుతున్న బీజేపీ తన తరహా మత రాజకీయాలతో అక్కడా ఫాసిజాన్ని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉంది. గతంలో ఎప్పుడూ వినిపించని కులాల మధ్య విబేదాలూ, దాడులూవంటి వార్తలు అక్కడినుంచీ రావటమే దానికి సూచన అనుకోవాలి. ఇక డిల్లీ పరిస్తితి చూస్తే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని పాలించిన "ఆప్" ఇప్పుడు అక్కడ దాదాపు తుడిచి పెట్టినట్టు అయింది, ఇప్పుడు డిల్లీకూడా బీజేపీదే. మరి దేశమంతా ఇలా మోడీ మాయలోనే మునిగి పోయిందా? బీజేపీకి ఇప్పుడు ఎదురు నిలబడ్డ వళ్ళెవ్వరూలేరా అంటే,, ఇప్పటికి ఇప్పుడు ఉన్న సమాధానం ఒరిస్సా. మొదటినుంచీ మతోన్మాదాన్ని వ్యతెరేకిస్తూ వచ్చిన నవీన్ పట్నాయక్ ఈ "సీజన్ హీరో".
ఏదేమైనా పేదఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య ఐక్యత, లాల్, నీల్ ఎజెండా మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్ళకపోతే మాత్రం భారత దేశం మధ్య యుగాల వైపు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా ముంచుకొస్తున్న ఫాసిజన్ని ఎదిరించకపోతే జరగబోయే ప్రమాదాన్ని కూడా ఆపలేం...