ఆ సినిమాతో శంకర్‌కి కష్టాలేనట!

17:00 - February 18, 2019

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అంటే ఒకప్పుడు శంకర్. ఇప్పుడు మాత్రం రాజమౌళే. నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు రాజమౌళి. రీసెంట్గా వచ్చిన 2.0 కూడా శంకర్ ఆశలన్ని తీర్చలేకపోయింది. దీంతో.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ భారతీయుడు సినిమాను మొదలుపెట్టాడు. ఏ టైమ్ లో ఈ సినిమా మొదలుపెట్టాడో కానీ అప్పటినుంచి శంకర్ కు వరుస కష్టాలే. వివరాల్లోకి వెలితే...  మొదట భారతీయుడు సినిమాను తెలుగు - తమిళ భాషల్లో దిల్ రాజు తీసేందుకు ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ దిల్ రాజు తప్పుకున్నాడు. ఇక హీరోగా కమల్ ని - హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నారు. కానీ షూటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఇక హిందీ మార్కెట్ కోసం అజయ్ దేవగన్ ని అనుకున్నారు. ఆయన కూడా మొదట ఓకే చెప్పాడు. కానీ ఇప్పుడు తప్పుకున్నాడు. ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లు తప్పుకుంటున్నారు. ఇక కమల్ కూడా రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దీంతో.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో శంకర్ కు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి అసలు ఈ భారతీయుడు 2 వస్తాడో రాడో అనే డౌట్‌ వస్తుందట!