దిల్‌ రాజు అలా చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో?

13:43 - January 27, 2019

ఎఫ్2 ఇచ్చిన వంద కోట్ల ఉత్సాహంతో దిల్ రాజు మాములు జోష్ లో లేరు. ఊహించిన దాని కన్నా ఐదారు రెట్లు ఎక్కవ విజయాన్ని సొంతం చేసుకోవడంతో గత ఏడాది చేదు జ్ఞాపకాలన్నీ పూర్తిగా మైండ్ లో నుంచి డిలీట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఫ్లోలో రాజు గారి చెబుతున్న కొన్ని మాటలు మాత్రం ఇపుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఇకపై తన సినిమాలకు సంబంధించిన కలెక్షన్ రిపోర్ట్స్ బ్రేక్ ఈవెన్ ఫిగర్స్ వగైరా వన్ని ఆయా థియేటర్లో డిస్ ప్లే లో వచ్చేలా చేస్తారట. అసలు దిల్‌ రాజు గారు ఇలా ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? దీని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఊహించకుండానే రాజు గారు ఇలాంటి ప్రకటన చేశారా? అంటూ కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. సరే ఎఫ్2 బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఇలాంటివి చేసుకున్నా బాగుంటుంది. ఎంత పెద్ద నిర్మాత అయినా అన్ని సినిమాలకు ఇదే తరహ ఫలితం దక్కదు కదా. పైగా వంద సినిమాల్లో పదో పదిహేనో మాత్రమే హిట్టు కొడుతున్నాయి. అలాంటప్పుడు మిగిలిన వాటి గురించి థియేటర్లలో బోర్డులు పెట్టడం జరిగే పని కాదు. ఏదైనా యావరేజో లేక డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఇదుగో మా సినిమాకు డబ్బులు తక్కువగా వచ్చాయి  చూడండి అంటూ  డిస్ ప్లే పెడతారా. అసలు దీనికి  సినిమా హాళ్ళ యజమానులు ఒప్పుకుంటారా అనేది చిక్కు ప్రశ్న. అంతేకాదు...ఇంత లెక్క వచ్చింది అని అధికారికంగా ప్రకటించుకుంటే ఐటి సమస్య వచ్చే అవకాశం లేకపోదు. మీరే చెప్పుకున్నారు కాబట్టి మొత్తం పన్నుకు లెక్క చూపండి అంటూ నిలదీసే హక్కు ఇచ్చినట్టు అవుతుంది.  ఇవి కాకుండా ఇందులో బయటికి కనిపించని సమస్యలు ఎన్నో ఉన్నాయి. మరి అంత అనుభవం ఉన్న దిల్ రాజు గారు ఇలా కలెక్షన్లు ఇకపై థియేటర్ల దగ్గరే పెట్టేస్తాం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో?....