ఒక్కరోజులో అయిదుకోట్లమంది చూసారు: సాయిపల్లవి రౌడీబేబి సాంగ్

15:39 - January 4, 2019

 

 

 

 

 

 

 

 

"వై దిస్ కొలవెరి".. పాట గుర్తుంది కదా ఏడేళ్ళకిందట ఆ పాట ఒక సంచలనం అయ్యింది. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చిన్నసైజు సునామీలా పాపులర్ అయ్యింది ఆ పాట, ఆతర్వాత కత్రినా కైఫ్‌ "కాలా చష్మా" కూడా అదే స్థాయిలో పాపులర్ అయ్యింది. ఇప్పటివరకు ఈ పాటను యూట్యూబ్‌లో 545మిలియన్ల మంది వీక్షించారు. దేశం మొత్తాన్ని ఈ పాట ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో సౌత్‌ నుంచి కొలవెరీ సాంగ్‌ అందరి నోట ఎలా వినపడిందో మళ్లీ ఇప్పుడు దక్షిణాది నుంచి అలాంటి ఓ పాటే రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ వీడియో సాంగ్‌లో ధనుష్‌, సాయి పల్లవి చేసిన మ్యాజిక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మామూలుగానే ధనుష్ అన్నా, సాయి పల్లవి అన్నా ఇప్ప్టి జనాల్లో కాస్త ఆసక్తి ఉంది. దానికి తోడు మ్యూజిక్ కూడా తోడవ్వటంతో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సంచలం అవుతోంది ఈ సాంగ్. ఇటీవలె రిలీజైన "మారి 2" సినిమాలోని "రౌడీబేబీ" సాంగ్‌ సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటలో సాయి పల్లవి ఎక్స్ప్రెషన్స్, ధనుష్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌కు మతిపోగొడుతున్నాయి. వీడియో సాంగ్‌ను విడుదల చేసి 48గంటలు గడవకముందే ఈ పాటను కోటికి పైగా వీక్షించారు. నవంబర్‌లో విడుదల చేసిన లిరికల్‌ సాంగ్‌ను ఇప్పటివరకు 5కోట్లకుపైగానే చూశారు. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏమిటంటే, ఈ పాట రసింది ధనుష్,  యువన్‌ శంకర్‌ రాజా అందించిన బాణీ కూడా క్యాచీగా ఉంది. ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీ ఈ సాంగ్ ని మరో మెట్టు ఎక్కించేసింది.