మరో వికెట్‌ కోల్పొయిన టీమిండియా

10:50 - January 3, 2019

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా మ‌రో వికెట్ కోల్పోయింది. టీమిండియా కెప్టెన్‌, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (23) స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగాడు. హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు పుజారా, కోహ్లీ నెల‌కొల్పిన అర్ధ‌శ‌త‌క భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. దీంతో భార‌త్ ప్ర‌స్తుతం 54 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 187 ప‌రుగులు చేసింది.