ఓటమిపై క్లారిటీ ఇచ్చిన కొహ్లీ

12:12 - February 25, 2019

రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. అసలు ఈ మ్యాచ్ ఓటమికి కారణాలేంటి..? అనే దానిపై భారత జట్టు కెప్టెన్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం దీనిపై అతడు మాట్లాడాడు. ఇంత తక్కువ స్కోరు చేసినా మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకొస్తామని అనుకోలేదు. దీనికి కారణం మా బౌలర్ల అసాధారణ ఆటతీరే. వాళ్ల పోరాటం చూస్తే గర్వంగా ఉంది. మా జట్టులో బూమ్రా మరోసారి అద్భుతం చేశాడు. అలాగే తొలి మ్యాచే అయినా మార్కండే చక్కగా ఆడాడు. ఈ మ్యాచ్ ఓటమికి పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యమే కారణం. రాహుల్ మాత్రం చక్కగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడింది. వాళ్ల బౌలర్లు చివరి ఓవర్‌లో టెన్షన్ ఫీల్ అవలేదు. వాళ్లు విజయానికి అర్హులు. ఈ పిచ్‌పై మరో 20-30 పరుగులు చేసుంటే గెలిచేవాళ్లం. ఎంతైనా టీ20 లో ఇంత తక్కువ స్కోరును కాపాడుకోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టులో రాహుల్ 50, కోహ్లీ 24, ధోనీ 29 నాటౌట్ రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇబ్బంది పడిన ఆసీస్ ఇన్నింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్.. బ్యాట్స్‌మన్ వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.