జీవితం జైలుకే అంకితం: డేరా బాబా కి జీవిత ఖైదు

01:38 - January 18, 2019

16 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌తో పాటు మరో ముగ్గురినిదోషులుగా చేస్తూ పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆకేసులో ఈరోజు శిక్షలను ఖరారు చేసారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గతంలో జర్నలిస్టు రామచంద్ర వరుస కథనాలు ప్రచురించారు. వాటిపై కక్ష పెంచుకున్న బాబా అనుచరులు 2002లో రామచంద్రను హత్య చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో డేరాబాబా దోషిగా తేలడంతో శిక్ష ఖరారు చేశామని తెలిపింది. 

ఇద్దరు మహిళా భక్తురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుకు హాజరయ్యారు.  గతంలో ఆయ‌న‌పై రెండు హత్య కేసులు ఉన్నాయి.డేరాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, గుర్మీత్ అసలు స్వరూపాన్ని మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పిన, జర్నలిస్ట్ రామ్‌చందర్ ఛత్రపతి ఆత్మహత్య, అప్పట్లో డేరా మేనేజర్‌గా పనిచేస్తూ అనుమానాస్పద స్థితిలో శవంగా తేలిన రంజిత్ సింగ్‌ల మరణాల వెనుక డేరా బాబా ఉన్నాడని ఆరోప‌ణ‌లున్నాయి. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీని వివరిస్తూ గుర్తుతెలియని వ్యక్తి రాసిన లేఖ 2002 అక్టోబర్‌లో ‘పూరాసచ్‌’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత అదే పత్రికలో పనిచేస్తున్న రామ్‌చందర్‌ ఛత్రపతి అనే పాత్రికేయుడిని తుపాకీతో కాల్చి చంపేశారు.  

ఛత్రపతిని చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించారని. తన రహస్యాలను ఎక్కడ బయటపెడతాడోనన్న అనుమానంతో రంజిత్‌ను హత్య చేయించాడని అనుమానాలున్నాయి. ఈ రెండు కేసుల‌పై గుర్మీత్‌పై అభియోగాలు నమోదవ్వగా. గతంలోనే సాక్షుల విచారణ ముగిసింది. ఛత్రపతిది ఆత్మహత్య కాదని, ఆ హత్య చేయించింది గుర్మిత్ బాబా అని ఇప్పుడు నిరూపితమయ్యింది. డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌కు జీవిత ఖైదు విధిస్తూ పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ఇప్పటికే 20 ఏళ్ల శిక్షని అనుభవిస్తున్న డేరా బాబా ఇక జీవితం మొత్తం జైలుకే అంకితం కానున్నాడు.  

మొదటి సారి భక్తురాల్లపై అత్యాచార కేసులొ తీర్పు వెలువడిన 2017 ఆగస్టు 25 నుంచి జైలు శిక్ష పడిన 30వ తేదీ వరకు పంచకుల, సిర్సా పట్టణాల్లో పెద్దఎత్తున అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో డేరా బాబాకి ఉరి శిక్ష విధించే అవ‌కాశాలున్నాయ‌ని కూడా వార్తలు రావటంతో ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా  దీంతో హరియాణాలోని డేరాబాబా  ఆశ్రమం పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుగానే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం ఉన్న పంచకుల, సిర్సాలో 144 సెక్షన్ విధించారు. పంచకుల న్యాయస్థానం సముదాయంలో చుట్టుపక్కల బారికేడ్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు.