నాని "జెర్సీ" ఆ సినిమాకి కాపీ?: హాలీవుడ్ కథని కాపీ చేసారా?

16:29 - January 14, 2019

మొన్నటి వరకూ వరుస హిట్లతో టాలీవుడ్ ని ఊపేసిన నాని కి కృష్ణార్జున యుద్దం సినిమా బ్రేక్ వేసింది. ఆ తర్వాత నాగార్జున తో వచ్చిన దేవదాస్ కూడా పెద్దగా నానికి పనికి రలేదు. రొటీన్‌ సినిమాలు చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న నాని ఫైనల్‌గా రూటు మార్చాడు. “మళ్లీ రావా” ఫేం గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా జెర్సీ.

నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్  లాస్ట్‌ ఇయర్‌ రెండు సినిమాలు ఫ్లాప్‌ అవడంతో ఈసారి ఇప్పటి ప్రేక్షకులకి కావాల్సిన తరహా చిత్రాన్ని నాని అందిస్తున్నాడు. జెర్సీ టీజర్‌లో మంచి ఎమోషన్‌తో పాటు కొత్తదనం తొణికిసలాడింది. మిడిల్‌ ఏజ్డ్‌ క్రికెటర్‌గా నాని తన రెగ్యులర్‌ పాత్రలకి పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తున్నాడు.

1980ల్లో సాగే కథ ఇది.ఇండియన్ క్రికెట్ టీంలోకి రావాలని కలలుకనే ఓ ఆటగాడి కథ ఇది. అప్ప‌టికే 36 ఏళ్లు రావ‌డంతో అంతా జీవితంలో ఓడిపోయావు అని.. ఏం సాధించ‌లేవు అంటూ నిరుత్సాహ‌ప‌రుస్తుంటారు. అప్పుడు హీరో ఎలా అనుకున్న‌ది సాధించాడు అనేది ఇన్స్ స్పిరేష‌న‌ల్ గా తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. 

ఈ స్టోరీలైన్‌ అచ్చంగా 'ఇన్విన్సిబుల్‌' అనే హాలీవుడ్‌ చిత్రం స్టోరీకి దగ్గరగా వుంది. అందులోను ముప్పయ్యేళ్లు దాటిన హీరో పిక్ అప్ ఫుట్‌బాల్‌ టీమ్‌లో చోటు కోసం ప్రయత్నిస్తుంటాడు. "ఇన్విన్సిబుల్" కథ ఫుట్ బాల్ నేపథ్యంలో సాగుతుంది. అందులో హీరో 30 ఏళ్ళు దాటినా తర్వాత దేశం తరపున ఫుట్ బాల్ ఆడేందుకు కష్టపడతాడు. తెలుగులో మాత్రం క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గౌతమ్.

హాలీవుడ్ నుండి కథలను ప్రేరణగా తీసుకుని చేయడం కామన్ అనుకున్నా ఇప్పుడు ఇది పూర్తి కాపీ గనక అయితే సినిమా విజయం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.  వరుసగా రెండు పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన నానికి ఈ సినిమా విజయం కీలకంగా మారింది. మరి ఏం జరుగుతుందో.. జెర్సీ ఏం చేస్తుందో చూడాలి.