' RRR ' లో హీరోయిన్స్‌ వారేనా ?

17:16 - November 15, 2018

దర్శకధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ ' RRR ' హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంచ్ అయింది. అయితే దీనిలో నటించే నటీనటుల గురించి మాత్రం ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్స్‌ గురించి. ఇంత భారీ సెట్స్‌తో చేస్తున్న ఈ సినిమాకి జక్కన్న ఎవరని హీరోయిన్స్‌గా పెడతారు?. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించనున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించేందుకు రాజమౌళి ఏ హీరోయిన్స్‌ని తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ముఖ్యంగా కీర్తి సురేష్, రష్మిక మందన్న పేర్లు వినబడుతున్నాయి. మరి రాజమౌళి ఇద్దరినీ తీసుకుంటున్నారా ? లేదంటే ఎవరో ఒకరినేనా? అదీకాదంటే వీరిద్దరూ కాకుండా వేరే హీరోయిన్స్‌ని సెలక్ట్ చేసుకుంటారా? అనే విషయం అధికారిక ప్రకటన వెలువడితే తప్ప చెప్పలేం.