70 కు వెళ్తున్న ' గీతా గోవిందం '

17:22 - September 11, 2018

‘గీత గోవిందం’ చిత్రం ఊహించని వసూళ్లను సాధిస్తోంది. ‘గీత గోవిందం’ 25 రోజులు పూర్తి చేసుకోవడంతో 60 కోట్ల కలక్షన్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు భావించారు. కాని 25 రోజుల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా మంచి షేర్ వస్తోంది. ఇప్పుడు గోవిందుడి దృష్టి 70 కోట్లపై ఉంది. అయితే ఇప్పుడు ’ శైలజా రెడ్డి అల్లుడు ’ రాబోతుంది.  ఇప్పటికే 67 కోట్ల షేర్ ను దక్కించుకున్న గీత గోవిందం...  శైలజా రెడ్డి అల్లుడు రాకముందే 69 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మరో కోటిని సునాయాసంగా దక్కించుకుని 70 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన ఫాలోయింగ్ తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శైలజా రెడ్డి అల్లుడు ఫలితం కాస్త అటు ఇటు అయితే గోవిందుడి జర్నీ ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటున్నారు. మరో వారాంతం పూర్తి అయితే గీత గోవిందం చిత్రం ఫైనల్ కలెక్షన్స్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.