48 గంటల్లో తప్పని నెట్‌ తిప్పలు

13:37 - October 13, 2018

మరో 48 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ తిప్పలు తప్పవట!.
అసలు ఏం అంటున్నారు?..నెట్‌ లేకపోతే ఎలా...తినాలన్నా, ఎక్కడికన్నా పోవాలన్నా..ఆర్డర్స్‌కు, డబ్బులు ట్రాన్స్ఫర్‌ చేయాలన్నా..అసలు ఇవన్నీ ఒకెత్తయితే...రోజూ వాట్సప్‌ చూడకుండా వుండటమా? అస్సలు జరగని పని అనుకుంటున్నారా?..అయితే 48 గంటలపాటు ఈ తిప్పలు తప్పవట!..
వివరాల్లోకి వెళ్లితే... ఇప్పటివరకూ .. రానున్న 48 గంటల్లో వాతావరణం ఇలా ఉండనుందన్న హెచ్చరికలు విని ఉంటాం. ఇప్పుడు అలాంటి తరహాలోనే ఇంటర్నెట్ హెచ్చరిక ఒకటి విడుదలైంది. ప్రపంచం మొత్తానికి ఇంటర్నెట్ వార్నింగ్ ఒకటి విడుదలైంది. ఇంటర్నెట్కు సంబంధించిన పేర్లు.. ఐపీ అడ్రస్ లను నియంత్రించే ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ కు సంబంధించిన భద్రతను మరింత పెంచేందుకు వీలుగా ఇంటర్నెట్ క్రిఫ్టోగ్రఫిక్ కీని మారుస్తున్నారు. ఈ మార్పునకు 48 గంటల సమయం పడుతుంది. అప్పటివరకూ ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం.. వెబ్ పేజీలు త్వరగా ఓపెన్ కాకపోవటంతోపాటు.. ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చూపించటంలాంటి సమస్యలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. డొమెయిన్ నేమ్ సిస్టం రక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు తాజాగా చేస్తున్న మార్పులు సాయం చేస్తాయని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్తితుల్లోనే ఈ మార్పును చేస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న 48 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ యూజర్స్ కు ఇబ్బందులు తప్పవంటున్నారు. అనుకుంటాం కానీ.. ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు తెర మీదకు వస్తే కానీ మనకున్న బలం ఎంతన్నది అర్థమవుతుంది. కరెంటు లేకపోతే బతకలేం అనుకునేవాళ్లు.. ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడు బతికేస్తారు. అలానే..ఇంటర్నెట్ కూడా. సౌకర్యం లేదన్న భయం తప్పించి.. ఇంటర్నెట్ లేకున్నా హాయిగా బతికేయొచ్చు. అదెలానో.. రానున్న 48 గంటల్లో చాలా మందికి అనుభవంలోకి రానుందంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?