4లక్షల 93వేల మంది ఓట్లు తొలగింపు: తెలంగాణ ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌

13:18 - December 3, 2018

తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికలకు ఇంకా మూడు రోజులే వ్వవధి వుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వాహణకు కావల్సిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయట!. విషియంలోకి వెళ్తే...రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి రజత్‌కుమార్‌ మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడుతూ..ఎన్నికల నిర్వహణ ఓ సవాల్‌ వంటిదని నెలరోజుల తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, ఎన్నికల నిర్వహణ సందర్భంగా న్యాయపరంగా పలు సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో మంచి మార్గదర్శకత్వం లభించినట్లయిందన్నారు. బోగస్‌ ఓట్లుగా భావించి 4 లక్షల 93 వేల మందిని జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డు సేకరించామని, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పార్టీ మేనిఫెష్టోలు, హామీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.