33 రూపాయలకే 4జీ అన్‌లిమిటెడ్‌ డేటా...

12:22 - August 18, 2018

వొడాఫోన్‌ ఇప్పుడు తన వినయోగదారులకు 33 రూపాయలలో అపరిమిత డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 33 రూపాయలకే 4జి స్పీడ్‌తో అపరిమిత డేటాను పొందవచ్చు. దీనికి సూపర్‌ నైట్‌ ఇంటర్నెట్‌ ప్యాక్‌ పేరుతో వొడాఫోన్‌ కంపెనీ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని వాలిడిటీ రాత్రి 1AM నుంచి 6AM వరకూ ఉంటుంది. ఈ సమయంలో, యూజర్‌ అపరిమిత 4జి డేటా పొందుతారు. 
దీనిలో ఒక గంట వాలిడిటీ సూపర్‌ ఆఫర్‌ ప్యాక్‌ని కంపెనీ ప్రవేశపెట్టింది. దీనిలో వినియోగదారులు 3జి/ 4జి వేగంతో అపరిమిత డేటాను పొందుతారు. ఎయిర్టెల్‌ మాదిరిగా, వొడాఫోన్‌ కూడా ఈ ప్లాన్‌ని ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మాత్రమే పరిచయం చేసింది. మీ వొడాఫోన్‌ నెంబర్‌పై ఈ ప్లాన్‌ యొక్క వాలిడిటీ చెక్‌ చేయాలనుకుంటే, మీరుMyVodafone యాప్‌ మరియు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్‌ నుండి మీ నెంబర్‌లో ఆఫర్‌ని చెక్‌ చేయవచ్చు. మరిన్ని బెస్ట్‌ ఆఫర్ల గురించి తెలుసుకోవాలంటే 121 నంబర్‌కు డయల్‌ చేయొచ్చు.