328 రకాల మందులకు చెక్‌ పెట్టిన కేంద్రం

10:03 - October 6, 2018

శుక్రవారం ఖమ్మంలో ఖమ్మం డ్రెగిస్టు, కెమిస్టు అసోసియేషన్‌ భవనంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు సీహెచ్‌ జనార్ధన్‌రావు, నాగేశ్వరరావు అధ్వర్యంలో హోల్‌సేల్‌ మందుల దుకాణాల యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఏడీ పల్లవి మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా 328 రకాల మందులను బ్యాన్‌ చేసినట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి అనధికారికంగా వచ్చే నాసిరకం మందులను రోగులకు ఇవ్వవోద్దని హెచ్చరించారు. హెల్‌సేలర్లు, రిటైలర్స్‌కు మందులు అమ్మకాలు వారి వద్ద నుంచి రోగులకు మందులు చేరే వరకు ప్రభుత్వం నిబంధనల మేరకు ధరలు అమ్మకాలు ఉండాలని ఆదేశించారు. నూతన ఫిక్స్‌డ్‌ డోసు మాత్రమే హోల్‌సేల్‌ వ్యాపార్లు రిటైల్‌ వారికి అమ్మకాలు జరపాలని పల్లవి సూచించారు.