2019లో డార్లింగ్‌ పెళ్లికొడుకు అవుతున్నాడట!

12:33 - October 25, 2018

ప్రభాస్‌ డార్లింగ్‌ వచ్చే సంవత్సరం పెళ్లికొడుకు అవుతున్నాడట!..ఇప్పటికే 39 వచ్చిన డార్లింగ్‌ కు పెండ్లి విషియంపై తన ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగిందట. ఇటు ఫ్యాన్స్‌, అటు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న ఆ పెళ్లి గడియలు 2019లో రానున్నాయి. ప్రభాస్ ఇటలీలో తన 39వ పుట్టినరోజును ' సాహో ' టీం సమక్షంలో జరుపుకున్నాడు. సాహో సినిమాను పూర్తి చేసుకున్న అనంతరం 2019లో ప్రభాస్ పెళ్లికి సిద్ధమైపోతాడని టాక్. త్వరలోనే ప్రభాస్ ఒక మంచి అమ్మాయి కోసం వెదుకుతున్నట్టు న్యూస్ కూడా వస్తుందని తెలుస్తోంది. నిజానికి ' బాహుబలి ' పూర్తైన వెంటనే పెళ్లి చేసుకుందామనుకున్నాడట కానీ వెంటనే ' సాహో ' ప్రారంభమవడంతో బ్రేక్ పడిందట. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టడమే కాదు. సమయాన్ని కూడా భారీగా వెచ్చిస్తున్నాడు. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.