2006ను మించి పేలుడు ఉంటుందట!

12:18 - December 5, 2018

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని సుప్రసిద్ధ సంకట్ మోచన్ మందిరాన్ని బాంబులతో పేలెస్తామని పేర్కొంటూ విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తోంది. 2006మార్చిలో ఇక్కడ జరిగిన పేలుడును మించి తిరిగి పెద్ద పేలుళ్లు జరపుతామని అగంతకులు ఆ లేఖలో హెచ్చరించారు. ఆలయ నిర్వాహకులు విశ్వంభరనాథ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని బాంబులతో పేల్చెస్తామంటూ లేఖ వచ్చింది. కాగా దీనిపై విశ్వభరనాథ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2006లో సంకట మోచన్ మందిరంలో జరిగిన బాంబు పేలుళ్లలో 11మంది మృతి చెందగా, వందకు మించి గాయాలపాలయ్యారు.