' 2.0 ' రిలీజ్‌ లేటు ఆ పక్షి వల్లేనట..!

17:39 - October 3, 2018

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న '2.0' ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్ గా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ' 2.0 ' ఇప్పటిదాకా ఇన్ని వాయిదాలు ఎందుకు పడ్డాయి అన్నదానికి తాజాగా ఒక ఇంటర్వ్యూలో శంకర్‌ వెల్లడించారు. టీజర్లో ఒక పక్షి భయంకరంగా కనిపిస్తుందిగా..  ఆ పక్షి వల్లే సినిమా రిలీజ్ వాయిదా పడిందట.  సినిమా బడ్జెట్ లో మూడో వంతు వీఎఫ్ ఎక్స్ కు ఖర్చుపెట్టారట.  వీఎఫ్ ఎక్స్ కు ఖర్చు పెట్టిన మొత్తంలో అధిక భాగం ఆ పక్షి కోసం ఖర్చయిందట.   మొదట్లో తన విజువలైజేషన్ కు తగ్గట్టు అవుట్ పుట్ రాలేదట. పైగా సమయానికి వాళ్ళు  అవుట్ పుట్ ఇవ్వక పోవడం... మాటి మాటికి డెడ్ లైన్స్ మార్చడంతో మార్వెల్ స్టూడియోస్ సినిమాలకు వీఎఫ్ ఎక్స్ వర్క్ చేసే సంస్థకు అప్పగించారట. భారీ స్థాయిలో వీఫెక్స్ వర్క్ అవసరం ఉండే సినిమాలకు వాయిదాలు కామనే.    ఏదేమైనా '2.0' సినిమాలో మంచి కంటెంట్ ఉంటే.. శంకర్ పడిన శ్రమకు.. వీఎఫ్ ఎక్స్ కోసం వెచ్చించిన సమయానికి ఫలితం ఉంటుంది.