2.0 నవంబర్‌ 29నైనా వస్తుందా?..

17:56 - September 4, 2018

ఇండియాలో ఇప్పటిదాకా అత్యంత ఖర్చుతో రూపోందిన సినిమా2.0. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లైకా సంస్థ ఇప్పటిదాకా 400 కోట్లకు పైగా ఖర్చు చేయడం సెన్సెషన్‌గా మారింది. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్సులకు సంబంధించిన ఒత్తిడిని తట్టుకోలేక నవంబర్ 29 డేట్ ప్రకటించారని నిజానికి అప్పుడైనా ఖచ్చితంగా వస్తుందా లేదా అని చెప్పలేమని చెన్నై మీడియాలో ఇప్పటికీ టాక్ నడుస్తూనే ఉంది.

ఒకవేళ నవంబర్‌లోనే వస్తుంది అనుకుంటే...ఇంకా 90రోజులే టైం వుంది. ఈ లోపు దీనికి కలలో కూడా ఊహించని ఓపినింగ్స్‌ రావాలి. అంతకన్నా ముందు బలమైన ప్రమోషన్‌ కావాలి. కానీ ఇప్పటి దాకా టీజర్‌ కూడా విడుదల కాలేదు. నవంబర్ 29న 2.0 వస్తుంది అనే ఆలోచనల్లో.. దాని  దరిదాపుల్లో ఉండకుండా చిన్న సినిమాల నిర్మాతలు దూరంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కనీసం ముందు వెనుకా రెండు వారాల గ్యాప్ ఉండేలా తమ రిలీజ్ డేట్లు షెడ్యూల్ చేసుకుంటున్నారు. వీలైనంత త్వరగా 2.0 టీజర్ లేదా ట్రైలర్ ని రిలీజ్ చేసి 29 డేట్ ని పక్కా చేస్తే మిగిలిన వాళ్లకు టెన్షన్ ఉండదు. అలా కాకుండా మళ్ళి మార్చాల్సి వస్తే మాత్రం చాలా చిక్కులు తప్పవు. 2.0కి శంకర్ బ్రాండ్ తోడు కావడంతో పాటు టెక్నికల్లి టాప్ స్టాండర్డ్ మూవీ అనే పేరు వచ్చింది కాబట్టి బిజినెస్ పరంగా ఇబ్బంది ఉండదు కానీ అసలు తేదీతోనే సమస్య.