' 2.ఓ ' బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చిన రజనీ...

14:51 - November 3, 2018

సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `2.ఓ` సినిమా వాస్తవ బడ్జెట్ ఎంత? గత కొంతకాలంగా అభిమానుల్లో - ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర డిబేట్ ఇది. ఈ సినిమాకి దాదాపు 550 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని ఓ కార్యక్రమంలో శంకర్ ప్రకటించడంతో అంత పెద్ద మొత్తం ఖర్చయ్యిందా? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. ఓవైపు మార్కెట్ వర్గాల్లో - మరోవైపు కామన్ ఆడియెన్ లోనూ 2.ఓ బడ్జెట్ పై ఒకటే ఆసక్తికర చర్చ సాగడం ఉత్కంఠ రేపుతోంది. అయితే అన్ని సందేహాలకు తెరదించుతూ నేడు 2.ఓ ట్రైలర్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ 2.ఓ బడ్జెట్ గురించి క్లారిటీ ఇచ్చారు. `2.ఓ` సూపర్ హిట్ ఫిలిం అని సర్టిఫికెట్ ఇచ్చిన రజనీ బడ్జెట్ మ్యాటర్స్ ని టచ్ చేశారు. 2.ఓ చిత్రాన్ని శంకర్ గొప్ప విజన్ తో రూపొందించారు. అతడు ఇండియన్ జేమ్స్ కామెరూన్ - స్టీవెన్ స్పీల్ బర్గ్ అంతటివాడు అంటూ పొగిడేయడమే కాదు... 600కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసిన నిర్మాత లైకా అధినేత సుభాష్ కరణ్ ని రజనీ పొగడ్తల్లో ముంచెత్తారు. 2.ఓ ట్రైలర్ ఈవెంట్ కి విచ్చేసిన జాతీయ మీడియాని - ఇరుగు పొరుగు పరిశ్రమల మీడియాని రజనీ వెల్ కం చేస్తూ ప్రసంగం ప్రారంభించడం కార్యక్రమంలో హైలైట్. మొదట ఈ సినిమాకి రూ. 300-350 కోట్లు అనుకున్నాం. ఆ తర్వాత అది అలా పైపైకి పాకుతూ 500కోట్ల బడ్జెట్ ని మించింది.. 550కోట్లు అయ్యింది.. చివరికి 600కోట్లకు చేరుకుంది.. అని రజనీ ఈ ఈవెంట్ లైవ్ లో బడ్జెట్ మ్యాటర్ ని రివీల్ చేశారు.