' 2.ఓ 'కి అమెరికాలో అదిరిపోయే రికార్డు

16:55 - November 27, 2018

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.0’ విడుదలకు ఇంకో రెండు రోజులే సమయం ఉంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 8 వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ దక్షిణాది చిత్రం ఇంత భారీ స్థాయిలో రిలీజ్ కావడం అనూహ్యమే. ఇప్పటి వరకూ... ‘బాహుబలి’ మాత్రమే ఇంత భారీగా రిలీజైంది. విదేశాల్లో సైతం ‘2.0’ రికార్డు స్థాయిలో రిలీజవుతోంది. అమెరికాలో ‘బాహుబలి’ కంటే భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. ఏకంగా అక్కడ 800 స్క్రీన్లలో ‘2.0’ను ప్రదర్శించబోతుండటం విశేషం. మూడు భాషలకు కలిపిన దక్కిన స్క్రీన్లు ఇవి. టికెట్ల రేట్లు కొంచెం రీజనబుల్ గానే ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయి. ప్రిమియర్లతోనే మిలియన్ల డాలర్లు వసూలయ్యేలా ఉంది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే 10 మిలియన్ల మార్కును ‘2.0’ సులువుగా అందుకునే అవకాశముంది. అత్యధికంగా తమిళంలో 320 థియేటర్లలో ‘2.0’ రిలీజవుతోంది. తెలుగు వెర్షన్ ను 270 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారట. హిందీ వెర్షన్ 210 దాకా థియేటర్లలో రిలీజవుతోంది. ఈ థియేటర్లన్నింటిలోనూ బుధవారమే ప్రిమియర్లు వేస్తున్నారు.ఇండియాలో ‘2.0’కు అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు మామూలుగా లేదు. పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. ఓవరాల్ వసూళ్ల మాటేమో కానీ.. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ‘2.0’ కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశముంది.