19 ఏళ్లకే తొలిముద్దు అనుభూతి

17:31 - October 22, 2018

' అర్జున్‌ రెడ్డి' , ' గీతా గోవిందం 'తో స్టార్‌ హీరో అయిపోయిన దేవరకొండ అతని పర్సనల్‌ విషియాలని తెలిపాడు. అందులోనూ ముద్దు విషియం. నార్మల్‌గా సినిమా వాళ్లు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అవసరానికి మించి మాట్లాడటం, అవసరం ఉన్నది మాట్లాడకుండా ఉండటం రెండూ చేయరు. చాలా కేర్‌ఫుల్‌గా డీల్ చేస్తుంటారు మీడియా, సొషల్ మీడియాలో. కానీ..విజయ్ రూటే సపరేటు. తన మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పేస్తుంటాడు. ఈ మధ్య రిలీజైన ' నోటా ' ఫ్లాప్ అంటూ స్వయంగా తానే ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు! ఇంత ఫ్రాంక్‌గా ఉండటం హీరోలకి కాస్త కష్టమే! అయినా విజయ్ దేవరకొండ అదే రూట్‌లో ముందుకుపోతున్నాడు. ఈ మధ్యే రానా హోస్ట్‌గా ప్రసారం అవుతోన్న ' నంబర్ వన్ యారీ ' షోలో పాల్గొన్నాడు విజయ్. అయితే అందులోనూ ట్రూత్ అండ్ డేర్ రౌండ్లో తన గురించి ఓ ఇంట్రస్టింగ్ ట్రూత్ ధైర్యంగా రివీల్ చేశాడు. మామూలుగా సినిమా వాళ్లు స్పందించటానికి ఇష్టపడని ప్రశ్న అది! రానా '' నువ్వు ఫస్ట్ కిస్ ఎప్పుడు చేశావ్?ఎలా అనిపించింది'' ?అని అడిగాడు. దానికి సూటిగా జవాబిచ్చిన దేవరకొండ19 ఏళ్ల వయస్సులో అని చెప్పాడు! అంతేకాదు.. తాను బాయ్స్ హాస్టల్లో చదువుకోవటం వల్ల అమ్మాయిలతో పరిచయాలు, స్నేహాలు ఆలస్యం అయ్యాయనీ, మొదట బెరుకుగా కూడా ఉండేదని అన్నాడు.