12000 వెబ్‌సైట్స్‌ బ్లాక్‌

13:55 - November 29, 2018

సినిమా నిర్మాతలకు సినిమా హిట్టవుతుందా? లేదా? అనేదానికన్నా ముందు..ఆ సినిమా పైరసీ భారిన పడుతుందేమో అనే భయం ముందుగా వారిని వెంటాడుతుంది. ఇదే నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా '2.ఓ' రిలీజైన సంగతి తెలిసిందే. అయితే పస్తుతం తమళ రాకర్స్‌ అనే సంస్థ పైరసీ రారాజుగా మారింది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే నిమిషాల్లో పైరసీ చేసి వెబ్‌సైట్స్‌లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ' 2.ఓ ' సినిమా పైరసీ భారిన పడకుండా చూడాలని చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిని స్వీకరించిన జస్టీస్‌ ఎం సుందర్‌ పైరసీ చేస్తున్న 12000 వెబ్‌సైట్స్‌ను బ్లాక్‌ చేయమని 37 ఇంటర్నెట్‌ ప్రొవైడర్లకి ఆదేశించారు.