100 కోట్ల క్లబ్‌లో చేరిన ' గీతా గోవిందం '...

17:19 - September 6, 2018

' గీతా గోవిందం ' చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే  50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ట్రేడ్ విశ్లేషకులను సైతం విష్మయపర్చుతూ ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం అయిన 50 కోట్ల షేర్ ను విజయ్ దేవరకొండ దక్కించుకోవడంతో ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ గా అంతా ఒప్పుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 402 థియేటర్లలో ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకోబోతుండగా * తెలుగు రాష్ట్రాల్లో 304 థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకోబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏకంగా 100 థియేటర్లలో ఈ చిత్రం 25 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఏ హీరోకు కూడా ఇంతటి ఘనత దక్కలేదంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.