హ్యట్రిక్‌ సినిమాతోనైనా బ్లాక్‌ బాస్టర్‌ సాధిస్తారా?

12:13 - October 31, 2018

'నా పేరు సూర్య' తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఫైనలైజ్ చేసునేందుకు అల్లు అర్జున్ చాలా సమయం తీసుకున్న సంగతి తెలిసిందే.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నాడని.. ప్రాజెక్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయిందని అధికారిక ప్రకటన మాత్రమే ఆలస్యం అని వార్తలు వస్తున్నాయి. 
సినిమాను ఎవరు నిర్మించాలనే విషయంలో కాస్త సందిగ్ధత నెలకొందని ఆ విషయం తేలిన వెంటనే బన్నీ-త్రివిక్రమ్ సినిమా ను లాంచ్ చేస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే బన్నీ - త్రివిక్రమ్ లకు ఇది హ్యాట్రిక్ చిత్రం. ఈ కాంబినేషన్ లో గతంలో 'జులాయి'.. 'S/o సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచాయి. మరి హ్యాట్రిక్ సినిమా తో అయినా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో వేచి చూడాలి.  ఇదిలా ఉంటే ఈ సినిమా ఒక హిట్  హిందీ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుందని కూడా వార్తలు వస్తున్నాయి.  ఇక తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ త్రివిక్రమ్ లు ఈ సినిమాకు 'భరత్ అనే నేను' హీరోయిన్ కియారా అద్వాని ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట.