హెయిర్‌ డ్యామేజ్‌కు చెక్‌ పెట్టాలంటే...

11:35 - August 22, 2018

హెయిర్‌ డ్యామేజ్‌ అవుతుందంటే ఎవరికైనా చాలా బాధగా వుంటుంది. ఎలాగైనా దానిని కంట్రోల్‌ చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ పద్దతిని పాటిస్తే హెయిర్‌ డ్యామేజ్‌ కాదు. అదేంటో చూద్దాం...

ఉసిరికాయల పొడి కలిపిన నీటిలో హెన్నా కలిపి మాడుకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. హెన్నా మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడడం వల్ల దట్టమైన జుట్టుతో పాటు.. శిరోజాలకు అవసరమైన పోషకాలు అందుతాయి. 15 రోజులకు ఒకసారి ఈ విధంగా తలకు ప్యాక్‌ వేయాలి.ఇలా చేయడం వల్ల దెబ్బతిన్న కురులు మరలా ఆరోగ్యకరంగా తయారవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా హెన్నా చుండ్రుతో సమర్థంగా పోరాడుతుంది.

చుండ్రు పోయేందుకు ఈ విధంగా చేస్తే కూడా ఫలితం వుంటుంది. రెండు టీ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బాలి. ఆవాల నూనెను మరిగించి గోరింట ఆకులను దాంట్లో వేయాలి. చల్లారిన తర్వాత మెంతుల చూర్ణాన్ని దానికి కలిపి మాడుకు పట్టించాలి. ఈ మిశ్రమం చుండ్రుపై బాగా పనిచేస్తుంది.

నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరి పొడి వేసి మరిగించాలి. దాంట్లో ఒక టీ స్పూన్‌ బ్లాక్‌ టీ, రెండు లవంగాలు వేసి బాగా కలియదిప్పాలి. దీనిలో హెన్నా కలిపి చిక్కటి పేస్టులా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు లేదా రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలకు అప్లై చేయాలి. దీన్ని రాసుకుంటే తెల్లవెంట్రుకలు కాసింత రంగు పులుముకుంటాయి.